Alias Rukmini Pre-Release Event: Nani’s Strong Confidence in Nithiin
టాలీవుడ్లో కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్‌కు ఈసారి గట్టి హిట్ పడబోతోందా? నేచురల్ స్టార్ నాని మాత్రం ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నితిన్ హీరోగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణీ’పై మూవీ టీమ్ భారీ ఆశలు పెట్టుకుంది. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్రబృందం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Alias Rukmini Pre-Release Event: Nani’s Strong Confidence in Nithiin
ఈ వేడుకలో హీరో నితిన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత రెండేళ్లుగా సరైన కథలు దొరక్క నటుడిగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని, కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడిపానని నితిన్ వెల్లడించారు. అయితే ‘అలియాస్ రుక్మిణి’ కథ విన్నప్పటి నుంచి తనలో కొత్త ప్రశాంతత వచ్చిందని, నిద్రమాత్రలు లేకుండా నిద్ర పోతున్నానని చెప్పారు. ఈ సినిమా తనకు ఎలాంటి కథలు ఎంచుకోవాలనే విషయంలో కొత్త దృష్టికోణాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యంగా తాను కష్టాల్లో ఉన్న సమయంలో నాని దేవుడిలా వచ్చి ఈ కథను తనకు అందించారని భావోద్వేగంగా చెప్పారు. కథ విన్నప్పుడు బంగారు పళ్లెంలో మంచి అవకాశం అందించినట్టుగా అనిపించిందని పేర్కొన్నారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు మురళీకే దక్కుతుందని చెబుతూ, ఈసారి బరాబర్ హిట్ కొడుతున్నా అని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాపై సమర్పకుడు నాని వ్యక్తం చేసిన నమ్మకం మరింత ఆసక్తిని పెంచింది. నిర్మాతగా ఈ సినిమా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, కంటెంట్ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా నితిన్‌తో పరిచయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో ఆయన నటన చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. నితిన్‌లోని అద్భుతమైన నటుడిని ఈ చిత్రం ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేస్తుందని అన్నారు. ఈ ఏడాదిలోనే అత్యంత ముఖ్యమైన కమ్‌బ్యాక్ చిత్రాల్లో ‘అలియాస్ రుక్మిణీ’ ఒకటిగా నిలుస్తుందని తనకు బలమైన నమ్మకం ఉందని వెల్లడించారు. ప్రేక్షకులను సినిమా మెప్పించకపోతే సినిమాలు తీయడం మానేస్తానంటూ సరదాగా చేసిన వ్యాఖ్య వేడుకలో హైలైట్‌గా నిలిచింది.

దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ నాని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నానని తెలిపారు. నితిన్ ఫిల్మోగ్రఫీలో తన పేరు ఉండటం ఆనందంగా ఉందన్నారు. నాని నిర్మాణంలో పనిచేయడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు. హీరోయిన్ ఆఫియా సయ్యద్ తన కల ఈ సినిమాతో నెరవేరిందని, నితిన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. నిర్మాత దీప్తి గంటా కూడా ఈ కథను విన్నప్పటి నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఎంతో ఆస్వాదించామని, నాని అందించిన స్వేచ్ఛ, సహకారం వల్లే ఈ ప్రయాణం సాధ్యమైందని తెలిపారు.
ఈ వేడుకకు హాజరైన దర్శకులు శివ నిర్వాణ, వెంకీ అట్లూరి, రాహుల్ సాంకృత్యన్, శైలేష్ కొలను, నిర్మాతలు దిల్ రాజు, వెంకట్ బోయినపల్లి తదితరులు చిత్ర విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికి నితిన్‌కు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని నాని పెట్టుకున్న నమ్మకం, చిత్రబృందం చెబుతున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ‘అలియాస్ రుక్మిణి’పై అంచనాలు పెరుగుతున్నాయి.