Manchu Manoj New Movie Vaddi Kasulavada : Fun fill Entertainer
మంచు మనోజ్ హీరోగా ‘వడ్దీ కాసులవాడ’
అప్పులన్నీ తీరితే తిరుపతిలో యూనివర్సిటీ
వడ్దీలు కట్టలేక చస్తూ, బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం
పర్సనల్ వివాదాలతో కొంత గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. గతేడాది భైరవం, మిరాయ్ లాంటి చిత్రాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. దాదాపు అరడజను పైగా ప్రాజెక్టులకు కమిట్ అయ్యిన మనోజ్.. విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ‘డేవిడ్ రెడ్డి’గా ఆడియెన్స్ ముందుకు రానున్న మనోజ్.. తన నెక్స్ట్ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కొ అప్డేట్తో అదిరిపోయే సర్ప్రైజ్లు ఇస్తున్నారు. దానిలో భాగంగా మనోజ్ ఇప్పుడు ఒక స్టైలిష్ కమ్‌బ్యాక్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న కొత్త చిత్రం ‘వడ్డీ కాసుల వాడ’ను అధికారికంగా ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాచీ టైటిల్, మనోజ్‌కు తగ్గ మ్యానరిజం, కామెడీ టచ్‌తో ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Manchu Manoj New Movie Vaddi Kasulavada : Fun fill Entertainer
ఇప్పటికే మనోజ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో వచ్చిన ‘బిందాస్’ మంచి విజయాన్ని అందుకుంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ‘బిందాస్’ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండగా, ‘వడ్డీ కాసుల వాడ’తో మరోసారి అదే వినోదాత్మక వైబ్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
టైటిల్ కాన్సెప్ట్ వీడియోలో మనోజ్ తనదైన స్టైల్లో కామెడీ టైమింగ్‌తో అలరించారు. దేవుడిని కోరుకుంటూ, ఆర్థిక సమస్యల మధ్య ఇబ్బందులు పడే మధ్యతరగతి వ్యక్తిగా ఆయన కనిపించిన తీరు నవ్వులు పూయిస్తోంది. ఈఎంఐలు, వాయిదాలు, అప్పులు వంటి అంశాలు నేటి సామాన్య జీవితంలో ఎంత భాగమైపోయాయో అదే కాన్సెప్ట్‌ను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘నా అప్పులన్నీ తీరిపోయి.. వచ్చే పుట్టినరోజుకి జంబానీ లాంటి లైఫ్ ఇస్తే.. బిందాస్‌గా హెలికాఫ్టర్‌లో తిరుపతి వచ్చి నీ అప్పు కూడా తీర్చేస్తాను. అప్పుడు అదే తిరుపతిలో అక్కడ అద్భుతమైన కాలేజ్ కట్టి క్యాస్ట్‌తో సంబంధం లేకుండా 25 శాతం ఫ్రీ ఎడ్యూకేషన్ ఇచ్చేస్తాను. అప్పటివరకు నన్ను, నా ఫ్యామిలీని, నా ఫ్యాన్స్‌ను, నా ప్రొడ్యూసర్స్‌ను, నా డైరెక్టర్ని, నా టెక్నీషియన్స్‌ని, ఇంకా ముఖ్యంగా మా రుణదాతలను జాగ్రత్తగా చూసుకోండి స్వామీ. వడ్దీలు కట్టలేక చస్తూ, బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం..’ అంటూ మనోజ్ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Manchu Manoj New Movie Vaddi Kasulavada : Fun fill Entertainer
‘వడ్డీ కాసుల వాడ’ కేవలం కామెడీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, కుటుంబ భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల జీవనశైలికి దగ్గరగా ఉండే కథ, హాస్యం, ఎమోషన్స్ కలగలిపిన పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి తేజ్ ఉప్పలపాటి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వింటేజ్ మనోజ్ ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్రబృందం తెలిపింది. ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే కథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి ఫుల్ మీల్స్‌లా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
Manchu Manoj New Movie Vaddi Kasulavada : Fun fill Entertainer
రామబ్రహ్మాం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ వీడియోకు వస్తున్న అద్భుత స్పందనపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తూ, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.