Nani’s Retro Look in Bloody Romeo
టాలీవుడ్లో ప్రతి సినిమాతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే హీరో నాని. కథల ఎంపికలోనే కాదు, పాత్రల కోసం తన లుక్‌ను మార్చుకోవడంలోనూ ఆయన ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఇటీవల ‘ది ప్యారడైజ్’తో మాస్ ఇమేజ్‌కు తగ్గ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ కోసం పూర్తిగా భిన్నమైన స్టైల్‌తో సందడి చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా బయటకు వచ్చిన ఆయన రెట్రో లుక్ ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Nani’s Retro Look in Bloody Romeo
దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘బ్లడీ రోమియో’ ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. తాజాగా విడుదలైన నాని న్యూ లుక్ ఆ అంచనాలకు మరింత స్టైలిష్ టచ్ ఇచ్చింది. కర్లీ ముల్లెట్ హెయిర్‌స్టైల్, రఫ్ బియర్డ్, డార్క్ సన్‌గ్లాసెస్‌తో నాని కనిపిస్తున్న తీరు ఆయన గత చిత్రాల లుక్స్‌కు పూర్తి భిన్నంగా ఉంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ రూపొందించిన ఈ మేకోవర్‌లో రెట్రో వైబ్‌తో పాటు ఒక ప్రత్యేకమైన అటిట్యూడ్ కనిపిస్తోంది. పాత్రకు అనుగుణంగా రూపొందించిన యాక్సెసరీస్ కూడా ఈ లుక్కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
‘బ్లడీ రోమియో’లో నాని కేవలం లుక్ పరంగానే కాకుండా, పాత్ర పరంగానూ కొత్తగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు భిన్నమైన కోణాల్లో కనిపించనున్నారనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డార్క్ హ్యూమర్, యాక్షన్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రం నాని కెరీర్లో మరో వైవిధ్యమైన ప్రయత్నంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
విభిన్నమైన కథనాలు, స్టైలిష్ మేకింగ్‌కు ప్రాధాన్యతనిచ్చే దర్శకుడు సుజీత్.. నానిని ఏ తరహా ప్రపంచంలో చూపించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో ప్రత్యేకమైన ముద్ర వేసిన ఈ సినిమా, నాని కొత్త లుక్‌తో మరోసారి చర్చల్లోకి వచ్చింది. తెరపై ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? చెఫ్, గ్యాంగ్‌స్టర్ కోణాలను దర్శకుడు కథలో ఎలా మిళితం చేయబోతున్నారు? అనే ప్రశ్నలకు సినిమా నుంచి వచ్చే తదుపరి అప్డేట్స్ సమాధానం చెప్పనున్నాయి.
నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో 34వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’కు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ‘ది ప్యారడైజ్’లో మాస్ అవతార్‌తో కనిపించిన నాని.. ‘బ్లడీ రోమియో’లో రెట్రో స్టైలిష్ లుక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.