Nabha Natesh Dhruva Sarja in ‘Chemistry’
హీరోయిన్ నభా నటేష్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కన్నడ స్టార్ హీరో ప్రిన్స్ ధ్రువ సర్జా సరసన ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘కెమిస్ట్రీ’. ఫుల్ ఫ్లెజ్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Nabha Natesh Dhruva Sarja in ‘Chemistry’
తాజాగా ‘కెమిస్ట్రీ’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా ధ్రువ సర్జా, నభా నటేష్ మధ్య ప్రేమ, అనుబంధం, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చుట్టూ సాగనున్నట్లు గ్లింప్స్‌తో ఆసక్తి పెంచారు. రొమాంటిక్ మూవీస్‌తో కెరీర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్.. కొంత గ్యాప్ తర్వాత మరోసారి కంప్లీట్ లవ్ స్టోరీలో కనిపించబోతుండటం విశేషం. ‘కెమిస్ట్రీ’లో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో పాటు, ధ్రువ సర్జాతో ఆమె కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు విభిన్న జానర్స్‌లో తన నటనతో ఆకట్టుకున్న నభా నటేష్.. ఈ ఏడాది ‘నాగబంధం’ చిత్రంలో తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ‘కెమిస్ట్రీ’తో మరోసారి లవ్ జానర్లో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతోంది.
ధ్రువ సర్జా–నభా నటేష్ జోడీ తెరపై ఎలా ఉండబోతుంది? వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుంది? అనే ఆసక్తిని టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే క్రియేట్ చేసింది. ఫ్రెష్ పెయిర్‌తో వస్తున్న ఈ కంప్లీట్ లవ్ స్టోరీపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.