Haiku Trailer: A Fresh Love Story
ఫ్రెష్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘హైకూ’. ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ను విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించగా.. హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు.
Haiku Trailer: A Fresh Love Story
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా ఫ్రెష్ కాన్సెప్ట్, ఆహ్లాదకరమైన సంగీతం, అందమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అమ్మాయిల కాలేజ్‌లో ఓ అబ్బాయి జాయిన్ అవ్వడం.. మొత్తం కాలేజ్‌లో అతడే ఒకే ఒక్క అబ్బాయి కావడం.. ఈ ఆసక్తికరమైన పాయింట్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత కథ క్రమంగా స్నేహం, ప్రేమ, అనుబంధం చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. కాలేజ్ లైఫ్‌తో పాటు ఉద్యోగ జీవితంలోనూ ప్రేమకథ ఎలా సాగింది? ఆ ప్రయాణంలో ఎదురైన సంఘర్షణ ఏమిటి? అనే ఆసక్తిని ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.
ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకోవాలి, ప్రేమించిన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి వస్తే ఎలాంటి భావోద్వేగం ఎదురవుతుంది అనే అంశాలను కూడా ట్రైలర్లో టచ్ చేశారు. ముఖ్యంగా చివర్లో వచ్చే డైలాగ్ కథలోని ఎమోషనల్ కోర్‌ను తెలియజేస్తోంది. దీంతో ‘హైకూ’ కేవలం యూత్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా.. ప్రేమలోని భావోద్వేగాలను కూడా చూపించే చిత్రంగా కనిపిస్తోంది.
ట్రైలర్‌లోని మరో ప్రధాన ఆకర్షణ సినిమాకు సంబంధించిన విజువల్స్, మ్యూజిక్. సిద్ధు కుమార్ అందించిన సంగీతం ట్రైలర్‌కు మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది. ప్రియేష్ గురుస్వామి కెమెరా పనితనం కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ్ ఆర్ట్ డైరెక్షన్, శక్తి ప్రణేష్ ఎడిటింగ్ సినిమాకు మరింత ప్లస్‌గా నిలిచేలా కనిపిస్తున్నాయి.
ఇక సినిమా షూటింగ్ పూర్తికాకముందే ‘హైకూ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఫ్రెష్ కథ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నచ్చడంతో డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. కాలేజ్ నేపథ్యంలో మొదలై ప్రేమ, అనుబంధం, ఎమోషన్స్ చుట్టూ సాగే ఓ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా ‘హైకూ’ కనిపిస్తోంది. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.