Missing Meghana Arrives on Sept 18
ఈ నెల 18న థియేటర్లలోకి ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’
థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే థ్రిల్‌తో పాటు బలమైన ఎమోషన్‌ను జోడించి తెరకెక్కించిన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్స్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 18న సుమారు 150 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
Missing Meghana Arrives on Sept 18
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన మూడు పాటలు, టీజర్ విడుదలయ్యాయి. విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు డిజిటల్ మీడియాలోనూ ఈ పాటలు వైరల్‌గా మారుతున్నాయి. ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం సినిమాకు ఫ్రెష్ ఫీల్‌ను తీసుకొచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.
ముఖ్యంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు అందించిన విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు వాచస్పతి తెలిపారు.
‘మిస్సింగ్ మేఘన’ కేవలం ఒక సాధారణ థ్రిల్లర్ కాదని దర్శకుడు వాచస్పతి చెబుతున్నారు. కథలోని ఎమోషన్, థ్రిల్ రెండూ ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేసేలా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు.
“థ్రిల్లర్ సినిమాలు ఇప్పటివరకు చాలా వచ్చాయి. ఇక ముందు కూడా వస్తాయి. కానీ ‘మిస్సింగ్ మేఘన’ మాత్రం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. రెండు సంవత్సరాల భవిష్యత్తును పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, వచ్చామా.. వెళ్లామా అన్నట్టుగా ఈ సినిమా చేయలేదు. క్లైమాక్స్‌లో వచ్చే హుక్ పాయింట్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది. ఇది నార్మల్ థ్రిల్లర్ కాదు.. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్,” అని దర్శకుడు వాచస్పతి పేర్కొన్నారు.
సినిమా కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నామని, అందుకే ఒక పెద్ద నిర్మాణ సంస్థ తమ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చిందని నిర్మాత పంచుమర్తి నరేష్ బాబు తెలిపారు. బిజినెస్ పరంగా కూడా సినిమా విషయంలో తాము హ్యాపీగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
‘మిస్సింగ్ మేఘన’ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను పలువురు ప్రముఖులు విడుదల చేశారు. సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేశారు. అనంతరం చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ను లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు విడుదల చేశారు. రెండో పాటను నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా, మూడో పాటను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, మచ్చ రవి విడుదల చేశారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేసి మరింతగా ప్రమోషన్స్‌ను పెంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.