Pooja Ponada Dancer Look Steals the Show
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ గాదె ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన హారర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ తలారి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్నారు.
Pooja Ponada Dancer Look Steals the Show
ఈ సినిమాలో నందు, లిఖిత హీరోయిన్లుగా కనిపించనుండగా.. పూజిత పొన్నాడ, సింధు కాసారం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పూజిత పొన్నాడ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాలో పూజిత పొన్నాడ ‘నర్తకి’ పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో రాజభవనంలో నర్తకిమణిగా సంప్రదాయ దుస్తుల్లో పూజిత కనిపిస్తుంది. ఆమె లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా పూజిత ఈ సినిమాలో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
హారర్ కథకు రాజభవనం, నర్తకి పాత్రతో పాటు విలేజ్ బ్యాక్‌డ్రాప్ జత కావడంతో సినిమాలో పూజిత పాత్రకు కథలో కీలకమైన ప్రాధాన్యత ఉండొచ్చనే ఆసక్తి నెలకొంది. ఈ పాత్రలో ఆమె నటన ఎలా ఉండబోతోందనేది సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీధర్ గాదె.. ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ కథను సరికొత్త ట్రీట్మెంట్తో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది.
చుట్టాలబ్బాయ్, ‘హైవే’ వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన వెంకట్ తలారి.. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈశ్వర్ రాచి రాజు, నందు, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.