మెగాస్టార్ చిరంజీవి మరో బ్లాక్‌బస్టర్ యాత్రకు సిద్ధమవుతున్నారని ఆయన కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న చిరంజీవి ఈ సక్సెస్ జోష్‌లోనే నెక్స్ట్ ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు. ఆయన తర్వాతి సినిమాను దర్శకుడు బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. ఇటీవల ఓ క్రేజీ పోస్టర్‌తో ఈ మూవీని అనౌన్స్ చేయగా తాజాగా షూట్ ప్రారంభానికి ముందు.. మంగళవారం లుక్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్ సమయంలో మెగాస్టార్ ఎంతో ఫోకస్‌తో కనిపిస్తున్నారు. కెమెరా ముందు నిలబడి, దర్శకుడు మరియు టెక్నీషియన్స్‌తో చర్చిస్తూ కనిపిస్తున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటో, ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలను అమాంతం పెంచేస్తోంది.
“సైలెన్స్ బిఫోర్ స్లాటర్” అనే ట్యాగ్‌లైన్‌ను బట్టి చూస్తే ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మెగాస్టార్ స్టైల్లో మాస్, ఎమోషన్, యాక్షన్ సహా అన్ని కలగలిసిన ప్యాకేజ్‌గా ఈ సినిమా ఉండబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి లుక్ టెస్ట్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టాలీవుడ్లో మరో సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ అంతా చిరంజీవి ఫస్ట్ లుక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఇతర నటీనటులు ఎంపికలో మూవీ టీమ్ బిజీగా ఉందని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఎన్కే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి కంప్లీట్ మాస్ క్యారెక్టర్ పోషించబోతున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు.





