Luxury Shopping Extravaganza In Hyderabad
హైదరాబాద్‌లో లగ్జరీ జ్యువెలరీ, ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల ప్రియుల కోసం మరో అద్భుతమైన షాపింగ్ వేడుక సిద్ధమవుతోంది. The Mirror Affair × The Aurum Tattva ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రీమియం ఎగ్జిబిషన్‌కు సంబంధించి తాజాగా రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ నటి లక్ష్మీ మంచు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
Luxury Shopping Extravaganza In Hyderabad
డిసెంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రధాన్ కన్వెన్షన్స్‌లో ఈ లగ్జరీ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ వేదికపై The Aurum Tattva గ్రాండ్ లాంచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ గోల్డ్, డైమండ్ జ్యువెలరీ బ్రాండ్లతో పాటు ప్రీమియం ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యేక కలెక్షన్లను సందర్శకుల ముందుకు తీసుకురానున్నారు.
యూకేకు చెందిన ఫౌండర్స్, స్ట్రాటజిక్ డైరెక్టర్స్ అనుషా గడ్డిపాటి, సుప్రజా గడ్డిపాటి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే 25కు పైగా ఎగ్జిబిషన్లను విజయవంతంగా నిర్వహించిన The Mirror Affair.. ప్రీమియం బ్రాండ్లను ఒకే వేదికపైకి తీసుకొస్తూ వినియోగదారులకు ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది.
ఈ భారీ వేడుక నిర్వహణలో డైరెక్టర్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఈవెంట్ ఎగ్జిక్యూషన్గా తేజు తమ్మినేని, సింధు యర్లగడ్డ, హర్షిత మోరుసు వ్యవహరిస్తున్నారు. పార్ట్నర్షిప్స్, క్లయింట్ రిలేషన్స్ బాధ్యతలను భవానా నాదెళ్ల, బిందు కిలారి పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఎగ్జిబిషన్‌ను కేవలం షాపింగ్ ఈవెంట్‌గానే కాకుండా ఒక ప్రత్యేకమైన ఫెస్టివ్ సెలబ్రేషన్‌గా తీర్చిదిద్దనున్నారు. లండన్ తరహా క్రిస్మస్, న్యూ ఇయర్ వాతావరణం, ఆకర్షణీయమైన ఫెస్టివ్ డెకరేషన్స్, వినోద కార్యక్రమాలు, ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. లగ్జరీ ఆభరణాలు, ఫ్యాషన్ కలెక్షన్లు, బ్యూటీ ఉత్పత్తులు, లైఫ్‌స్టైల్ బ్రాండ్లతో ఈ రెండు రోజుల వేడుక సందడిగా సాగనుంది.