నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా : కృతిశెట్టి

‘ఉప్పెన’ చిత్రంతో ఐదేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్‌ను చూసి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కృతిశెట్టి. అయితే ఆ తర్వాత ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు పర్వాలేదనిపించినా.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే, ఏఆర్ఎం, అన్నగారు వస్తారు లాంటి సినిమాలతో వరుస పరాజయాలు చూసింది. కానీ అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ చాన్సెస్ అందుకుంటోంది. ఈ శుక్రవారం ఆమె నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించిన ఈ చిత్రాన్ని విఘ్నేశ్ శివన్ రూపొందించగ, నయనతార నిర్మించారు. సినిమా విడుదలై చాలా రోజుల తర్వాత తన మూవీ సక్సెస్ టాక్ రావడంపై కృతిశెట్టి మీడియాతో ఇలా ముచ్చటించింది.

‘‘‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. చాలా రోజుల తర్వాత నేను నటించిన మూవీ హిట్ అవడం ఎమోషనల్‌గా అనిపిస్తోంది. విఘ్నేశ్ శివన్ స్టోరీ చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. ఆడియెన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారని అనుకున్నా. అనుకున్నట్టే ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మారథం పడుతున్నారు. ‘ఉప్పెన’ తర్వాత పూర్తిస్థాయి లవ్ స్టోరీ చేయలేదు. అలాంటి ఫుల్ లెంత్ ప్రేమ కథ చేసే అవకాశం ఇందులో వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అని కౌంట్ చేసుకుంటున్నారు. అది చాలామందికి హార్ట్‌కు దగ్గరగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. -ఈ జనరేషన్‌లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఫోన్ లేకుండా ఉండడం చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్‌‌ను అందరూ రిలేట్ చేసుకుంటున్నారు. విజువల్ కాన్సెప్ట్ 2040 ఫ్యూచరిస్టిక్‌గా ఉన్నా, కథ మాత్రం అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది. నా పర్సనల్ విషయానికొస్తే.. వర్క్ ఉన్నప్పుడు నేను అసలు ఫోన్ టచ్ చేయను. లేనప్పుడు మాత్రం బ్యాలెన్స్‌గా వాడుతుంటాను. ఇప్పుడు మాత్రం ఫోన్ అలవాటు కొంచెం ఎక్కువే. ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ఫోన్ చాలా మంచి సాధనం. లైక్స్, షేర్స్‌పై నాకు పెద్దగా పట్టింపు ఉండదు. ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను వాడుతున్నాను. ప్రస్తుం వరుస తమిళ సినిమాలు చేయడం ప్లాన్ చేసింది కాదు. అందులో నాకు చాలా కథలు నచ్చాయి. తెలుగు ఆడియన్స్ నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. వాళ్లకు ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకుని ఈ సమయం తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో మళ్లీ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లాను. ఫైటింగ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. సమయం దొరికితే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి రూపొందించబోయే వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీలో నటించబోతున్నా. అలాగే రెండు తమిళ సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి’’.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 6 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని