సత్యదేవ్ ‘రావు బహదూర్’ మొదటిపాటకు ముహూర్తం

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావు బహదూర్’. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ+ఎస్ మూవీస్ , శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌కి అద్భుతమైన రెస్పాన్స్ర్‌‌ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి మొదటిపాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ ఏప్రిల్ 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. సత్యదేవ్ పొడవాటి జుట్టు, కళ్ళద్దాలతో రెట్రో-కూల్ లుక్‌లో కనిపిస్తుండగా, దీప ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ సున్నితమైన లవ్ మెలోడీని సూచిస్తున్నాయి. సైకలాజికల్ ఇంటెన్సిటీ, కనుమరుగవుతున్న ఒక రాజరిక ప్రపంచపు అవశేషాలను కలగలిపిన ఎమోషనల్ డ్రామాగా ‘రావు బహదూర్’ రూపుదిద్దుకుంటోంది. రచయిత, దర్శకుడు, ఎడిటర్‌గా వెంకటేశ్ మహా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథని మలిచారు. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని కార్తిక్ పరమార్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని స్మరణ్ సాయి అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌ రోహన్ సింగ్. అగ్రశ్రేణి నిర్మాతలు, ప్రత్యేకమైన కథన శైలితో కూడిన దర్శకుడు, అలాగే సత్యదేవ్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన నటనను కనబరిచే పాత్రలో కనిపిస్తున్న ‘రావు బహదూర్’ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 6 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని