Jyoti Poorvaj Killer Released On Dusshera
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ సై-ఫై థ్రిల్లర్ ‘కిల్లర్’. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Jyoti Poorvaj Killer Released On Dusshera
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కథ ప్రకారం, సినిమా విడుదలయ్యే అక్టోబర్ 17న మన దేశానికి చెందిన గొప్ప శాస్త్రవేత్త డా. పూర్వజ్‌ను ఏలియన్స్ సంప్రదిస్తారు. తాము ఒక స్పేస్‌షిప్‌ను భూమిపైకి పంపిస్తున్నామని తెలియజేస్తారు. అంతేకాదు, ఈ విషయాన్ని మిగతా ప్రపంచానికి కూడా తెలియజేయాలని, మానవాళిని రక్షించడమే తమ ఉద్దేశమని ఆ ఏలియన్ డా. పూర్వజ్‌కు చెబుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మన భవిష్యత్ ఆ ఏలియన్‌కు గతం కావడం.
అసలు మరో కాలం నుంచి వచ్చిన ఆ ఏలియన్ డా. పూర్వజ్‌ను ఎందుకు సంప్రదించింది? స్పేస్‌షిప్‌ను భూమికి ఎందుకు పంపిస్తోంది? మానవాళికి ఎదురుకానున్న ముప్పు ఏమిటి? ఆ ఏలియన్ అందించాలనుకుంటున్న సహాయం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తెరలేపుతూ ‘కిల్లర్’ రిలీజ్ డేట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో కనిపించే “అక్టోబర్ 17న మీ భవితను నిర్ణయిస్తాం..” అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
‘కిల్లర్’ చిత్రాన్ని ఓవర్సీస్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓఎంజీ పిక్చర్స్ ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను చేపట్టింది. అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా సహా పలు దేశాల్లో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.