AnandDeverakonda EpicFirstSemester Third song
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొనగా, మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తున్నారు.
AnandDeverakonda EpicFirstSemester Third song
ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన చిత్రబృందం, గురువారం మూడో పాట ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ మెలోడీకి ప్రముఖ గాయనీగాయకులు కె.ఎస్. చిత్ర, ఎస్.పీ. చరణ్ తమ గాత్రాలతో ప్రత్యేకమైన మాధుర్యాన్ని అందించారు.
‘కుశలమా అంటూ అడిగే అతడి కౌగిలింత.. కుశలమే అంటూ పలికే ఆమెలోని చింత.. మనసులో మాట అర్ధమయ్యేంత చనువు ఉన్నదంటా.. మనసా వాచా..’ అంటూ శ్రీహర్ష ఈమని రాసిన సున్నితమైన పదాలు ప్రేమలోని ఆత్మీయతను, ఇద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని నేచురల్‌గా చూపిస్తున్నాయి. హీరో, హీరోయిన్ మధ్య పెరుగుతున్న ప్రేమను పాటలో అందంగా చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది.
మెలోడీ, లిరిక్స్, విజువల్స్ కలయికతో రూపొందిన ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది