Kingdom Fame Venkatesh VP Turns Hero
‘కె ర్యాంప్’ వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘కింగ్డమ్’ ఫేమ్ వెంకటేష్ వి.పి హీరోగా నటిస్తున్నారు. సురేష్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ‘డీ.జీ.పీ’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.3 కావడం విశేషం. ధీరజ్ న్యాతి ఈ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
Kingdom Fame Venkatesh VP Turns Hero
మలయాళ టెలివిజన్, సినీ రంగాల్లో వెంకటేష్ వి.పి ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా ‘సుడా సుడా ఇడ్లీ’ పేరుతో రెస్టారెంట్ స్టార్టప్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ చిత్రంలో మురుగన్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్ వి.పి, ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా టాలీవుడ్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
వెంకటేష్ వి.పి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ కొత్త చిత్రంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో గ్లింప్స్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను వినోదాత్మకంగా డిజైన్ చేశారు. తిరువనంతపురంలోని తన రెస్టారెంట్లో ఆర్డర్లు తీసుకుంటూ బిజీగా ఉన్న వెంకటేష్ వి.పికి ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ, దర్శకుడు సురేష్ తేజ్ ఫోన్ చేస్తారు. తమ సినిమాలో నటించేందుకు ఆహ్వానిస్తున్నామని చెప్పగానే, తనను మరోసారి విలన్ పాత్ర కోసమే సంప్రదిస్తున్నారని వెంకటేష్ భావిస్తాడు. అయితే ఈసారి విలన్‌గా కాదు, తమ సినిమా హీరోగా నటించాల్సిందిగా ఆఫర్ చేస్తున్నామని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అంతటితో ఆగకుండా సినిమా కథను వివరించగా వెంకటేష్ వి.పి మరింత ఇంప్రెస్ అవుతారు. ఇలా ఫన్నీ డైలాగ్స్, వినోదాత్మక ట్విస్ట్‌లతో రూపొందించిన ఈ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులకు మంచి ఫన్ అందిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.