Vijay Deverakonda & Rashmika Meet CM Vijay
‘రణబాలి’ విడుదలకు ముందు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నలకు ఓ ప్రత్యేకమైన అనుభవం ఎదురైంది. ఈ స్టార్ జంట తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ను కలుసుకున్నారు. బిజీ షెడ్యూల్లోనూ వారితో ఆప్యాయంగా ముచ్చటించిన సీఎం విజయ్.. ఈ భేటీని మరింత ప్రత్యేకంగా మార్చారు.
Vijay Deverakonda & Rashmika Meet CM Vijay
ఈ ముగ్గురి మధ్య జరిగిన సమావేశంలో సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం, పని, ప్రపంచానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చినట్లు విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సీఎం విజయ్‌తో గడిపిన సమయంపై విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దళపతి విజయ్ తన బిజీ షెడ్యూల్ నుంచి సమయం కేటాయించి, ఎంతో ప్రేమగా ఆహ్వానించారని తెలిపారు. ఆయనతో మాట్లాడిన తర్వాత తనపై మరింత అభిమానం పెరిగిందని పేర్కొన్నారు.


“దళపతి, సీఎం విజయ్ గారితో ఎంతో అందమైన సమయాన్ని గడిపాను. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి, తన ప్రేమను పంచుకున్నారు. జీవితం, పని, ప్రపంచం గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలను మాతో పంచుకున్నారు. ఆయనను ఒక్కసారి కలిసినప్పుడే మరింత అభిమానించే వ్యక్తిగా మారిపోయారు. థ్యాంక్యూ విజయ్ సార్!” అంటూ విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్‌తో స్టార్ జంట భేటీ కావడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది.