RambhaUrvashiMenaka BadTimeBandBaaja Song
తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే అల్లరి నరేష్ మరోసారి నవ్వుల సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ నుంచి తాజాగా ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ అనే కొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట తన ఎనర్జీ, ఫన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
RambhaUrvashiMenaka BadTimeBandBaaja Song
చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు ‘నా కంటి మీద కనులే’ పాట, టీజర్ సినిమాపై మంచి బజ్‌ను తీసుకొచ్చాయి. ఇప్పుడు వచ్చిన ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది.
పాట టైటిల్‌కు తగ్గట్టుగానే హీరో జీవితంలో ఎదురయ్యే కష్టాలు, చిక్కులను సరదాగా చూపిస్తూ ఈ గీతాన్ని రూపొందించారు. బ్యాడ్ టైమ్‌ను కూడా నవ్వుకునేలా మార్చే పరిస్థితులను కామెడీ టచ్‌తో ప్రజెంట్ చేయడం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్యాచీ ట్యూన్, ఫన్నీ సిట్యుయేషన్స్తో పాట ఆద్యంతం జోష్‌గా సాగుతోంది.
చైతన్ భరద్వాజ్ అందించిన బీట్‌ఫుల్ కంపోజిషన్‌కు సింగర్ రామ్ మిరియాల తన ప్రత్యేకమైన ఎనర్జిటిక్ వోకల్స్‌తో మరింత ఊపు తీసుకొచ్చారు.
‘బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా.. మోత మోగిస్తున్నాదే.. గుడ్ డే బిస్కెట్ అయినా దొరకనంటందే..’ అంటూ భాస్కరభట్ల రవికుమార్ రాసిన లిరిక్స్ పాటలోని సరదా భావాన్ని చక్కగా ప్రతిబింబిస్తూ వినోదాన్ని పెంచుతున్నాయి. విజువల్స్‌లో అల్లరి నరేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకుంటున్నారు. ఆయన ఎదుర్కొనే బ్యాడ్ టైమ్ ఎపిసోడ్స్‌ను ఫన్‌గా చూపించిన తీరు సినిమాలో ఉండబోయే ఎంటర్టైన్మెంట్కు చిన్న శాంపిల్‌లా కనిపిస్తోంది. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ గ్లామర్, స్క్రీన్ ప్రజెన్స్ కూడా పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఫాంటసీ, కామెడీ, వినోదాత్మక అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.