Hreem Teaser Launch Event
పవన్ తాతా, చమింద వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న హారర్-మిస్టికల్ థ్రిల్లర్ “హ్రీం” చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ రావూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్‌ను ఆవిష్కరించారు.
Hreem Teaser Launch Event
ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ…”‘హ్రీం’ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. నిర్మాత శివ మల్లాల ఈ చిత్రంపై చూపిన ప్యాషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మంచి విజయాలు సాధించి మరిన్ని పెద్ద చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. హీరో పవన్, హీరోయిన్ చమింద వర్మ ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందాలి. రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి వంటి అనుభవజ్ఞులైన నటులు ఈ చిత్రానికి మరింత బలం చేకూరుస్తారు. దర్శకుడు రాజేష్ రావూరి ఈ చిత్రంతో విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అని అన్నారు.
దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ…”‘హ్రీం’ టీజర్ ఎంతో ఆకట్టుకుంది. టైటిల్ ‘హ్రీం’ అయినా, ఫలితం ‘క్రీమ్’లా ఉండబోతోందనే భావన కలిగిస్తోంది. చమింద వర్మ అద్భుతంగా నటించింది. రాజీవ్ కనకాల, బెనర్జీ, తనికెళ్ల భరణి వంటి నటీనటులతో చిత్రానికి మంచి బలం లభించింది. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ…”శివ మల్లాల సినిమాపై ఉన్న అవగాహన, ప్రణాళికా దక్షత వల్ల నిర్మాతగా కూడా విజయవంతమవుతాడనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాతో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రాజ్ పవన్ మాట్లాడుతూ…”ఈ సినిమా నిర్మాణంలో శివ మల్లాల ప్రతి విభాగాన్ని సమన్వయం చేస్తూ ముందుండి నడిపించారు. వీఎఫ్ఎక్స్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలను కూడా నాపై ఉంచిన ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు నా వంతు కృషి చేశాను” అని వెల్లడించారు.
సంగీత దర్శకుడు మార్కస్ మాట్లాడుతూ…”‘హ్రీం’ కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించాం. శివ మల్లాల నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ చిత్ర సంగీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.
నటుడు రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) మాట్లాడుతూ…”ఈ చిత్రంలో నాకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. దర్శకుడు రాజేష్, నిర్మాత శివ మల్లాల నాపై ఉంచిన నమ్మకాన్ని నా నటనతో నిలబెట్టానని భావిస్తున్నాను” అని తెలిపారు.
దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ…”శివ మల్లాల అన్ని విభాగాలపై మంచి అవగాహన కలిగిన వ్యక్తి. ‘హ్రీం’ కోసం పనిచేసిన టీమ్ ఎంతో ప్రతిభావంతంగా శ్రమించింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు రాజేష్ రావూరి మాట్లాడుతూ…”కొత్త దర్శకుడినైనా ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటీనటులు నాకు ఎంతో సహకరించారు. నిర్మాత శివ మల్లాల నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. పవన్, చమింద అద్భుతంగా నటించారు. మా సాంకేతిక బృందం ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ప్రేక్షకుల ఆదరణ మా చిత్రానికి లభిస్తుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ…”శివ మల్లాల మంచి మిత్రుడు. ఆయన ఆహ్వానం మేరకు ఈ చిత్రంలో నటించాను. షూటింగ్ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. దర్శకుడు, కెమెరామెన్, నిర్మాత మధ్య ఉన్న సమన్వయం చిత్ర నాణ్యతను మరింత పెంచింది” అని అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ…”శివ మల్లాల ఈ చిత్రానికి అద్భుతమైన టీమ్‌ను సమీకరించారు. ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. మిస్టిక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు రాజేష్ తనకు కావాల్సిన నటనను మా నుంచి చక్కగా రాబట్టారు. పవన్, చమింద ఈ చిత్రంతో మంచి గుర్తింపు పొందుతారు. సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది” అని తెలిపారు.
హీరోయిన్ చమింద వర్మ మాట్లాడుతూ…”‘హ్రీం’తో టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్న నిర్మాత శివ మల్లాలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాపై ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎంతో శ్రమించాను. టీజర్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. మా దర్శకుడు రాజేష్, డీవోపీ అరవింద్, సంగీత దర్శకుడు మార్కస్, వీఎఫ్ఎక్స్ టీమ్ అందరూ చిత్రానికి బలమైన అండగా నిలిచారు. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ మూవీ. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
హీరో పవన్ తాతా మాట్లాడుతూ…”శివ మల్లాల నిర్మాతగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుడిలా నన్ను ప్రోత్సహించారు. దర్శకుడు రాజేష్ చెప్పిన కథ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఇందులో ప్రేమ, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అంశాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. సీనియర్ నటులతో కలిసి పనిచేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నాను. ‘హ్రీం’ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.
నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ…”దాదాపు 25 ఏళ్ల జర్నలిజం ప్రయాణం తర్వాత నిర్మాతగా మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో మీడియా మిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ నాకు అండగా నిలిచారు. దర్శకుడు రాజేష్ చెప్పిన కథలోని కోర్ పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. డెమో చూసిన తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. పరిమిత బడ్జెట్లో నాణ్యమైన సినిమా చేయాలనే లక్ష్యంతో మా టీమ్ అంకితభావంతో పనిచేసింది. వరంగల్ సమీపంలోని పెద్దపెండ్యాల గ్రామంలో చిత్రీకరణ జరిపాం. స్థానిక ప్రజలు కూడా విశేషంగా సహకరించారు. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. హీరోయిన్ చమింద వర్మ దుబాయ్ నుంచి వచ్చి ఎలాంటి పారితోషికం ఆశించకుండా ఈ చిత్రంలో నటించడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. హీరో పవన్ కూడా ఎంతో కష్టపడ్డాడు. మా మొత్తం టీమ్ కృషికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని విశ్వసిస్తున్నాను” అని పేర్కొన్నారు.
నటీనటులు
పవన్ తాతా, చమింద వర్మ, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం, రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) తదితరులు.
సాంకేతిక బృందం
సమర్పణ: శ్రీమతి సుజాత మల్లాల
నిర్మాత: శివ మల్లాల
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ రావూరి
డీవోపీ: అరవింద్
సంగీతం: మార్కస్ ఎం
ఎడిటింగ్ & డీఐ: వైఎస్ఎస్ శివప్రకాశ్
వీఎఫ్ఎక్స్ డైరెక్టర్: రాజ్ పవన్ కొమ్మోజు
సౌండ్ డిజైన్: ప్రేమ్ డేవిడ్
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
పీఆర్వో: మూర్తి మల్లాల