‘Dear Heart’ Motion Poster Released by Director Sai Rajesh
యూత్‌ను ఆకట్టుకునే భావోద్వేగ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ హార్ట్’. వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
‘Dear Heart’ Motion Poster Released by Director Sai Rajesh
తాజాగా ‘డియర్ హార్ట్’ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సక్సెస్ఫుల్ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మోషన్ పోస్టర్లో వినిపించిన ప్రేమ భావనలకు సంబంధించిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొన్ని ప్రేమకథలు కొంతకాలం మాత్రమే గుర్తుండిపోతాయని, మరికొన్ని మాత్రం కాలం ఉన్నంత వరకు మనసుల్లో నిలిచిపోతాయని చెప్పే భావోద్వేగ సంభాషణలు ప్రేమికుల హృదయాలను తాకేలా ఉన్నాయి. ప్రేమలోని అనుబంధం, జ్ఞాపకాలు, విడిపోలేని భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘డియర్ హార్ట్’లో ప్రేమకు సంబంధించిన కొత్త కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. కథలో భావోద్వేగాలకు, ప్రేమ ప్రయాణానికి ప్రాధాన్యత ఉంటుందని మోషన్ పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో సురేష్ గురు, పృధ్వీ రాజ్, సత్య ప్రకాష్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరవింద్ బి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. సుహాస్ సంగీతం సమకూరుస్తున్నారు. కథకు లక్ష్మణ్ టేకుమూడి, అజయ్ యార్లగడ్డ రచన అందించారు. ‘డియర్ హార్ట్’కు సంబంధించిన విడుదల తేదీతో పాటు ఇతర వివరాలను చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుంది.