Chiru Kaka Balayya Dada -Mega Mass Diwali –
పండగ వేళ టాలీవుడ్లో ఇద్దరు టాప్ స్టార్స్ తమ సినిమాలతో మాస్ ట్రీట్‌కు సిద్ధమయ్యారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’గా ఇంటెన్స్ అవతార్‌తో అలరిస్తుంటే.. మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘దాదా’గా స్టైలిష్ మాస్ లుక్‌తో సందడి చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల నుంచి విడుదలైన స్పెషల్ పోస్టర్లు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అటు చిరు కత్తి పట్టి రంగంలోకి దిగితే.. ఇటు బాలయ్య తనదైన స్టైల్లో పండగకు మాస్ కిక్ ఇచ్చారు. దీంతో ఈ దీపావళి టాలీవుడ్ అభిమానులకు డబుల్ ధమాకాగా మారింది.
Chiru Kaka Balayya Dada -Mega Mass Diwali –
కాకాగా చిరు ఇంటెన్స్ అవతార్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే ఆసక్తి నెలకొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి దీపావళి సందర్భంగా విడుదలైన పోస్టర్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వర్షంతో తడిసిన వాతావరణం.. చుట్టూ పచ్చని పొలాలు.. చేతిలో కొడవలి.. ముఖంలో కసి.. ఇలా చిరంజీవిని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అవతార్‌లో చూపించారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా చిరు లుక్ చూస్తుంటే సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అనస్వర రాజన్‌ను ‘అమ్ములు పాప’గా పరిచయం చేస్తూ ‘హార్ట్ ఆఫ్ కాకా’ అంటూ ఆసక్తి పెంచారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Chiru Kaka Balayya Dada -Mega Mass Diwali –
దాదాగా బాలయ్య స్టైలిష్ మాస్ జాతర
మరోవైపు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న ‘దాదా’ కూడా దీపావళి సందడిని రెట్టింపు చేసింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ విజయంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన దీపావళి స్పెషల్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
లెదర్ జాకెట్, సన్‌గ్లాసెస్‌తో బాలయ్య స్టైలిష్ అండ్ ఫ్లాంబాయంట్ లుక్‌లో కనిపిస్తుంటే.. ఆయన పక్కన బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ గ్లామర్‌తో మెరిశారు. కలర్‌ఫుల్ లైటింగ్, గ్రాండ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ పోస్టర్ పండగ వాతావరణాన్ని మరింత పెంచింది. అంతేకాదు, ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు ‘దాదా ధమాకా’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ప్రకటించారు. తమన్ స్వరపరిచిన ఈ పాట నవంబర్ 13న విడుదల కానుంది.
ఈ సినిమాలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.
చిరంజీవి ‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతికి విడుదల కానుండగా, బాలకృష్ణ ‘దాదా’ డిసెంబర్ 24న క్రిస్మస్కు థియేటర్లలో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలకూ తమన్ సంగీతం అందిస్తుండటం.