Ashok Galla Fun-Filled VISA 2nd Teaser
యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ‘VISA – వింటారా సరదాగా’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.
Ashok Galla Fun-Filled VISA 2nd Teaser
ఈసారి టీజర్‌ను పూర్తిగా హీరో అశోక్ గల్లా పాత్ర చుట్టూ రూపొందించారు. అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, ప్రేమలో పడిన తర్వాత వచ్చే పరిస్థితులను సరదాగా వివరిస్తూ హీరో చెప్పే మాటలు ఆకట్టుకుంటున్నాయి. సహజమైన డైలాగ్స్, కామెడీ, లవ్, ఎమోషన్స్ కలగలిపి టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
అమ్మాయిల వల్లే అన్ని సమస్యలు వస్తాయని చెబుతూ.. ‘‘అమ్మాయిలను ముట్టుకుంటే మసి.. పట్టుకుంటే నాశనం.. పెళ్లి చేసుకుంటే మట్టి..”అని ‘ఖలేజా’ సినిమాకు సంబంధించిన ఐకానిక్ డైలాగ్‌ను రిఫరెన్స్‌గా ఉపయోగించడం మరో హైలైట్‌గా నిలిచింది. ఈ రిఫరెన్స్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో ఉద్భవ్ రఘు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
విజయ్ బుల్గానిన్ అందిస్తున్న సంగీతం టీజర్‌కు మంచి ఎనర్జీని తీసుకొచ్చింది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుండటంతో ‘VISA – వింటారా సరదాగా’పై యూత్‌లో అంచనాలు పెరుగుతున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.