Pahalgam Love Story Release on Aug 21
టాలీవుడ్లో దర్శక నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పి.ఎన్. రామచంద్రరావు కొంత విరామం తర్వాత మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పహల్గాం లవ్ స్టోరీ’ ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Pahalgam Love Story Release on Aug 21
గాయత్రి కళా చిత్ర బ్యానర్‌పై పి.ఎన్. రామచంద్రరావు నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమ, దేశభక్తి, జాతీయ సమైక్యత అంశాలను కలిపి రూపొందించిన ఇంటెన్స్ పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. కృష్ణమోహన్, చిత్రశుక్ల హీరో హీరోయిన్లుగా నటించగా.. సుమన్, పూజా బిస్త్, జయప్రకాష్ నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘పహల్గాం లవ్ స్టోరీ’లో ఓ వైపు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథను చూపిస్తూనే.. మరోవైపు దేశాన్ని, జాతీయ సమైక్యతను ప్రభావితం చేసే అంశాలను కథలో భాగంగా మలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కశ్మీర్ నేపథ్యంలో సాగే కథకు అక్కడి సహజ అందాలు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చేలా ఉన్నాయి. జమ్ము కాశ్మీర్‌లోని అందమైన, అరుదైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరపడం సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. లవ్, యాక్షన్, ఎమోషన్‌తో పాటు దేశభక్తి అంశాలు కలిసిన కథను ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా అందించేందుకు మేకర్స్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
సినిమా విడుదలకు ముందు తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్లో కనిపించే నేపథ్యం, పాత్రల లుక్ సినిమాకు సంబంధించిన కథపై క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. ఈ సినిమా కేవలం వినోదాన్ని అందించే ప్రేమకథ కాదని, దేశభక్తిని మేల్కొలిపే ఒక ముఖ్యమైన జాతీయ అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావిస్తున్నామని దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు చెబుతున్నారు.