Anil Ravipudi evokes memories of Jandhyala.
మన సినిమాలో పాటలు ఎలా ఉండాలంటే జీవీ..
క్లాసు పాట, మాసు పాట, ఎమోషనల్ పాట, మెలోడీ పాట, డీజే పాట, బీజీఎం పాట..
హాస్యాన్ని తన సినిమాల ప్రధాన బలంగా మార్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన ప్రత్యేక శైలిని చాటుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా రూపొందుతున్న భారీ ఫెస్టివల్ ఎంటర్టైనర్ #VenkyAnil5/#NKRAR2 కోసం సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్‌ను ఎంపిక చేసిన విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ అనౌన్స్మెంట్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది జి.వి. ప్రకాష్ ఎంట్రీ కంటే, దాని వెనుక దాగి ఉన్న జంధ్యాల మార్క్ హాస్యానికి చేసిన నివాళే.
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘ఆహా నా పెళ్లంట’ సినిమాలోని మెడ వరకు ఇసుకలో పాతిపెట్టిన ఐకానిక్ కామెడీ సన్నివేశాన్ని ఈ ప్రోమోలో మళ్లీ ఆవిష్కరించారు. దర్శకుడు జంధ్యాల సృష్టించిన ఆ క్లాసిక్ హాస్య క్షణాలను గుర్తు చేసేలా రూపొందించిన ఈ వీడియోలో జి.వి. ప్రకాష్ కూడా అదే తరహా పరిస్థితిలో కనిపించడం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మన సినిమాలో పాటలు ఎలా ఉండాలంటే జీవీ..’ అంటూ ‘క్లాసు పాట, మాసు పాట, ఎమోషనల్ పాట, మెలోడీ పాట, డీజే పాట, బీజీఎం పాట..’ అంటూ నవ్వులు పూయించేలా ఉందీ వీడియో. అనిల్ మార్క్ టైమింగ్, జి.వి. ప్రకాష్ రియాక్షన్స్ కలిసి ఈ చిన్న ప్రమోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాయి.
ఈ స్పెషల్ వీడియో ద్వారా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ కూడా చిత్ర బృందంలో భాగమని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సంగీతం, సాహిత్యం పరంగా బలమైన టీమ్‌ను సిద్ధం చేసుకున్న ఈ సినిమా పాటలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని నవ్వులు, భావోద్వేగాలు, పండుగ వాతావరణం కలగలిపిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజెన్స్, జి.వి. ప్రకాష్ సంగీతం కలిసి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సహనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anil Ravipudi evokes memories of Jandhyala.
జి.వి. ప్రకాష్ సంగీత దర్శకుడిగా ఎంపికైన వార్త ఎంత ఆనందం కలిగించిందో, జంధ్యాల క్లాసిక్ కామెడీని గుర్తు చేసిన అనిల్ రావిపూడి క్రియేటివ్ ప్రోమో అంతకంటే ఎక్కువగా ప్రేక్షకుల మనసు దోచుకుందనే చెప్పాలి. జంధ్యాల హాస్యానికి నివాళి అర్పిస్తూ, తనదైన శైలిలో నవ్వులు పంచిన అనిల్ మరోసారి ప్రమోషన్స్‌లోనూ తానే స్పెషల్ అని నిరూపించారు.