Allu Arjun Praises Dulquer Aakashamlo Oka Tara
సినిమా బాగుంటే స్టార్డమ్తో సంబంధం లేకుండా ప్రశంసించే అల్లు అర్జున్.. ఇప్పుడు మరో సినిమాపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను ఆయన ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా తన తండ్రి అల్లు అరవింద్‌కు కూడా ఎంతో నచ్చిందని బన్నీ చెప్పడం విశేషం.
Allu Arjun Praises Dulquer Aakashamlo Oka Tara
దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయమవుతుంది. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 20న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్.. దుల్కర్‌పై ప్రశంసలు కురిపించారు. మలయాళం నుంచి తెలుగు వరకు అన్ని భాషల్లోనూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో దుల్కర్ తన నటనా వైవిధ్యాన్ని నిరూపించుకున్నారని అన్నారు. ఈ సినిమా ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
ఇక ఈ వేడుకలో బన్నీ చెప్పిన మరో విషయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా సినిమాలు చూసిన తర్వాత తన తండ్రి అల్లు అరవింద్ అంతగా ఎగ్జైట్ అవ్వరని, కానీ ‘ఆకాశంలో ఒక తార’ చూసిన తర్వాత మాత్రం చాలా బాగుందని, మనసుకు నచ్చిందని చెప్పారని వెల్లడించారు. ఆయన తన సినిమాల గురించి కూడా అంతగా మాట్లాడరని, అలాంటిది ఈ చిత్రంపై అలా స్పందించారంటే ఇందులో మంచి సోల్ ఉందని తనకు అనిపించిందని బన్నీ పేర్కొన్నారు.
మరోవైపు దుల్కర్ కూడా అల్లు అర్జున్‌పై తన అభిమానాన్ని బయటపెట్టారు. తన తొలి సినిమా షూటింగ్ సమయంలో తాను ఉన్న ఇంట్లో బన్నీ ఫొటో ఉండేదని గుర్తుచేసుకున్నారు. ‘అల వైకుంఠపురములో’ తనకు ఇష్టమైన సినిమాల్లో ఒకటని, కరోనా సమయంలో కుటుంబంతో కలిసి ఎన్నోసార్లు చూశానని చెప్పారు.
దర్శకుడు పవన్ సాధినేని ఈ కథను కరోనా సమయంలో రాసినట్లు వెల్లడించారు. ప్రతి అమ్మాయి తన కలను సాకారం చేసుకోవాలనే బలమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాపై చిత్రబృందం ఎంతో నమ్మకంగా ఉంది.
కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు అల్లు అరవింద్, స్వప్నదత్, సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం, స్ర్కీన్‌ప్లే రైటర్ గుణ్ణం గంగరాజు, నటీనటులు రుహానీ శర్మ, స్వసిక విజయన్, చైతన్య జొన్నలగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.. ఇది ప్రతి అమ్మాయి కలను నిజం చేసే చిత్రమని, ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని అన్నారు.