Chiranjeevi Mega158 Begins With Pawan Kalyan Clap
టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. #Mega158 వర్కింగ్ టైటిల్‌తో చిరంజీవి నటిస్తున్న 158వ చిత్ర పూజా కార్యక్రమాలతో గురువారం ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. గురువారం జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ అందరూ కలవడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముహూర్తపు షాట్‌కు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం మరో హైలైట్‌గా నిలిచింది. చిరంజీవి కుమార్తె, నిర్మాత సుష్మిత కొణిదెల, దర్శకుడు వీవీ వినాయక్ కలిసి కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకులు బి.గోపాల్, ఏ.కోదండ రామిరెడ్డి, నాగబాబు కలిసి దర్శక నిర్మాతలకు స్ర్కిప్ట్‌ను అందజేశారు.

ఈ ఈవెంట్‌కు మెగా బ్రదర్స్ ఒకే కారులో రావడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగా కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు. “మెగా క్లాప్‌తో మొదలైన మెగా బ్లాక్‌బస్టర్” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Chiranjeevi Mega158 Begins With Pawan Kalyan Clap
‘‘కాకాజీ’ టైటిల్ పరిశీలనతో ఉన్న ఈ చిత్రంలో చిరంజీవి కూతురిగా ‘ఛాంపియన్’ ఫేమ్ అనస్వర రాజన్ నటిస్తోంది. అలాగే కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించడం విశేషం. చిరంజీవి మోహన్‌లాల్ కలిసి స్క్రీన్‌పై కనిపించబోతుండటం అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారింది. ఇక చిరంజీవి భార్యగా ప్రియమణి కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు డింపుల్ హయతి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించబోతుందని సమాచారం. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, బండ్ల గణేష్ కూడా ఈ సినిమాలో భాగమవుతుండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ కాస్టింగ్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ కథగా కనిపిస్తోంది. సంగీత దర్శకుడు ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాస్ బీట్లతో పాటు ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రధాన బలంగా ఉండబోతుందని భావిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తీక్, ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్. రూబెన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాష్ వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Chiranjeevi Mega158 Begins With Pawan Kalyan Clap
ఇప్పటికే “వాల్తేరు వీరయ్య”తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి, బాబీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాతో మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న బాబీ, ఈసారి మరింత పెద్ద కాన్వాస్‌పై కథను రూపొందిస్తున్నారు.

Chiranjeevi Mega158 Begins With Pawan Kalyan Clap