A glimpse of Ram’s 23 film has been released :
హీరోగా తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రామ్ పోతినేని. శుక్రవారం (మే 15) రామ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. తన కెరీర్లో కొత్త ఛాప్టర్ ప్రారంభిస్తూ ‘#RAPO23’ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాతో రామ్ పోతినేని దర్శకుడిగా కూడా మారుతున్నారు. కథ, దర్శకత్వ బాధ్యతలను స్వయంగా ఆయన తీసుకోవడం అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు.
A glimpse of Ram’s 23 film has been released :
ఇది రాపో సినిమాటిక్స్ (RAPO Cinematics) బ్యానర్‌పై రూపొందుతోంది. బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్‌లో రామ్ “వీర” పాత్రలో ఇంటెన్స్ లుక్‌తో కనిపించారు. రగ్గడ్ స్టైల్, డార్క్ టోన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. “లొన్ వుల్ఫ్” కాన్సెప్ట్ చుట్టూ సాగే కథలో రామ్ కొత్త అవతారంలో కనిపించనున్నట్టు స్పష్టమవుతోంది.
A glimpse of Ram’s 23 film has been released :
Introducing “𝙑𝙀𝙀𝙍𝘼” in #RAPO23
ఈ ట్యాగ్‌లైన్‌తో సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తి పెంచేశారు. ఇప్పటివరకు ఎనర్జిటిక్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్.. ఇప్పుడు దర్శకుడిగానూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్లో అత్యంత ప్రయోగాత్మక చిత్రంగా నిలవనుందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసి మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఈ ఏడాది ఎండింగ్ డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.





