‘కాంతార’ రేంజ్ కథ అనుకున్నారు కానీ.. ‘వీరభద్రుడు’ సరిహద్దులు దాటలేడు

suriya veerabhadrudu movie review :

రివ్యూ: వీరభద్రుడు (Veerabhadrudu)
నటీనటులు: సూర్య, ఆర్‌జే బాలాజీ, త్రిష, ఇంద్రాన్స్, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు
సంగీతం: సాయి అభ్యంకర్
ఎడిటర్: కళైవాణన్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు
దర్శకుడు: ఆర్‌జే బాలాజీ
రిలీజ్ డేట్:15-‌‌/05/2026
నిడివి : 153 నిమిషాలు

గత రెండేళ్లుగా కంగువా, రెట్రో వంటి వరుస ఫెయిల్యూర్స్ చూసిన సూర్య తాజాగా ‘కరుప్పు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ‘వీరభద్రుడు’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. ఆర్జే బాలాజీ కీలక పాత్ర పోషిస్తూ డైరెక్షన్ చేయగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. వాస్తవానికి గురువారమే విడుదల కావాల్సి ఉండగా, టెక్నికల్ ఇష్యూ కారణంగా తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం రిలీజ్ అయ్యింది. మరి భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
suriya veerabhadrudu movie review :

కథ విషయానికొస్తే :
తమిళనాడుకు చెందిన శివరామన్‌ (ఇంద్రాన్స్) తన చిన్న కూతురు మాళవిక (అనఘా మాయ) ప్రాణాలను కాపాడుకోవాలనే ఆశతో హైదరాబాద్‌ నగరానికి వస్తాడు. అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు అత్యవసరంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆపరేషన్ కోసం భారీ మొత్తంలో డబ్బు అవసరం కావడంతో, తమ కుటుంబానికి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న బంగారు నగలను తాకట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. “హైదరాబాద్‌లో పెడితే మంచి విలువ వస్తుంది” అనే నమ్మకంతో నగరానికి అడుగుపెడతారు. కానీ నగరానికి వచ్చిన కొద్దిసేపటికే వారి వద్ద ఉన్న ఆ నగలను ఓ గ్యాంగ్ దోచుకుపోతుంది. ఒక్కసారిగా ఆశలు చిద్రమవడంతో, శివరామన్‌ తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు కష్టపడి ఆ నగలను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ, అవి కోర్టు సీజ్‌లోకి వెళ్లిపోతాయి. తన కూతురి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ నగలను వెంటనే విడుదల చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ సూచనతో బేబీ కృష్ణ (ఆర్‌జే బాలాజీ) అనే లాయర్‌ను ఆశ్రయిస్తాడు. మొదట సహాయం చేస్తానని నమ్మకం కలిగించిన బేబీ కృష్ణ, తర్వాత కేసును కావాలనే లాగిస్తూ ప్రతి వాయిదాకు డబ్బులు వసూలు చేస్తూ తండ్రి–కూతుళ్లను మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తాడు. రోజులు గడుస్తున్నకొద్దీ మాళవిక ఆరోగ్యం విషమిస్తుంది. ఆసుపత్రి ఖర్చులు, కోర్టు వాయిదాలు, లాయర్ డిమాండ్లు… అన్నింటికీ మధ్య శివరామన్‌ పూర్తిగా విరిగిపోతాడు. చివరికి కోర్టు ఎదుట ఉన్న వీరభద్రుడు ఆలయం ముందు కూర్చొని, “నా కూతురికి న్యాయం చేయడానికి నువ్వే దిక్కు” అంటూ దేవుణ్ని వేడుకుంటాడు. ఆ వేడుక వినిపించినట్టే, వీరభద్రుడు (సూర్య) సాధారణ మనిషి రూపంలో భూమిపైకి దిగివస్తాడు. కానీ అతని దివ్యశక్తులను అంగీకరించని బేబీ కృష్ణ, “దేవుడివైతే మహిమలతో కాదు… చట్టం ముందు మనిషిలా పోరాడి ఈ కేసు గెలుచుకో” అంటూ సవాల్ విసురుతాడు. ఆ సవాల్‌ను స్వీకరించిన వీరభద్రుడు, సాధారణ వ్యక్తిలా కోర్టులో అడుగుపెట్టి వ్యవస్థలో దాగి ఉన్న అవినీతి, న్యాయంలో జరుగుతున్న ఆలస్యం, పేదల బలహీనతలపై పోరాటం మొదలుపెడతాడు. చివరికి అతడు చట్టపరంగా ఆ కుటుంబానికి న్యాయం చేశాడా? మాళవిక ప్రాణాలను కాపాడగలిగాడా? న్యాయవ్యవస్థలోని లోపాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే సినిమా అసలు కథ.

suriya veerabhadrudu movie review :

ఎవరెలా చేశారంటే :
ఈ చిత్రంలో సూర్య వీరభద్రుడిగా భగవంతుడు పాత్ర పోషించారు. ఓ కొత్త తరహా దేవుడిగా కనిపిస్తూ తన స్క్రీన్ ప్రెజెన్స్‌, లుక్స్‌, నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎంట్రీ సీన్స్‌, కోర్ట్ ఎపిసోడ్స్‌లో సూర్య కనిపించే తీరు అభిమానులకు మంచి ట్రీట్‌లా అనిపిస్తుంది. పాత్ర నిడివి తక్కువైనా, ఉన్నంతలో తన ముద్ర వేయడంలో మాత్రం విజయవంతమయ్యాడు. కానీ తనదొక క్యామియోలాగే అనిపించడం సినిమాకు మైనస్‌ చెప్పుకోవచ్చు. ఇక లాయర్ బేబీ కృష్ణ పాత్రలో ఆర్‌జే బాలాజీ మాత్ర సినిమా మొత్తం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించాడు. అసలు ఈ సినిమాను తనకోసమే తీసుకున్నాడా అనే అనుమానం కలుగుతుంది. విలనిజాన్ని పెద్దగా అరుపులు, హడావుడి లేకుండానే తన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ప్రీతి పాత్రలో త్రిష నిజాయతీ గల లాయర్‌‌గా నటించింది. కారు నడిపే సీన్ తప్ప తన పాత్రకు పెద్దగా స్కోప్‌గా ఉండదనే చెప్పాలి. సినిమా ప్రారంభంలో ఇంద్రాన్స్‌, అనఘా మాయ పాత్రల చుట్టూ బలమైన ఎమోషన్ బిల్డ్ చేసిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్ తర్వాత ఆ ట్రాక్‌ను దాదాపు పక్కనపెట్టేయడం కథకు మైనస్‌గా మారింది. దీంతో మొదట ప్రేక్షకుడిని కదిలించిన భావోద్వేగం తర్వాత అంతగా కొనసాగదు. ఇక నటరాజన్ సుబ్రహ్మణ్యం కు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చే పాత్ర దక్కింది. మహారాజ తర్వాత మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు.

suriya veerabhadrudu movie review :

ఎలా ఉందంటే :
న్యాయస్థానాల్లో అన్యాయం జరిగే వారికి అండగా ఆ దేవుడే నిలబడాలనుకోవడం గతంలో గోపాల గోపాల చిత్రంలో చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ కొంతమేర వాస్తవ ఘటనలు చూపించడం కాత్తదనంలా అనిపిస్తుంది. మాస్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, హీరో ఎలివేషన్‌, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలతో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా సూర్య తన నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. పాత్రలోని తీవ్రతను, కోపాన్ని, భావోద్వేగాలను సమతూకంగా చూపిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. సినిమా కథ సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగినా, హీరో పాత్రకు ఇచ్చిన బ్యాక్‌డ్రాప్‌, గ్రామీణ వాతావరణం, ప్రతీకారం చుట్టూ తిరిగే కథనం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మొదటి భాగంలో పాత్రల పరిచయం కొంచెం నెమ్మదిగా అనిపించినా, ఇంటర్వెల్‌ తర్వాత కథ వేగం అందుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు మంచి ముగింపునిస్తాయి. దర్శకుడు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ఎపిసోడ్స్‌ను బలంగా డిజైన్ చేశాడు. అయితే కథలో కొత్తదనం కొంత మేర తగ్గిన భావన కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉండటం సినిమాకు చిన్న మైనస్‌గా మారింది. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ గ్రామీణ నేపథ్యాన్ని అద్భుతంగా చూపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్‌కు బాగా తోడ్పడింది. పాటలు కథ ప్రవాహానికి సరిపోయేలా ఉన్నా, గుర్తుండిపోయే స్థాయికి మాత్రం వెళ్లలేకపోయాయి. అలాగే దేవుడికి సరిహద్దులు పెట్టడం చాలా ఫన్నీగా ఉందనిపిస్తుంది. ‘కాంతార’ రేంజ్ క్లైమాక్స్ ఊహించారు కానీ.. ప్రెజెంటేషన్‌లో ఆర్జే బాలాజీ కాస్త తడబడ్డాడు అనే చెప్పాలి. మొత్తానికి దైవ భక్తి ఉండేవారు ఇష్టపడే సినిమాగా మిగిలిందని చెప్పుకోవచ్చు. కథలో కొత్తదనం ఆశించే వారికి ఇది సాధారణ అనుభూతిని ఇవ్వొచ్చు.

ప్లస్ పాయింట్స్ :
నటీనటుల పెర్ఫార్మెన్స్
సాయి అభ్యాంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు

మైనస్ పాయింట్స్ :
కథ, కథనం
సూర్య నటనకు స్కోప్ లేకపోవడం
ఆర్జే బాలాజీ డైరెక్షన్ కన్నా నటనపై ఎక్కువ ఇంటరెస్ట్ చూపడం

రేటింగ్ : 2/5

Related Posts

రివ్యూ : ‘‘సతీ లీలావతి’’ చూడటం సాహసం చేయడమే

రివ్యూ : ‘‘సతీ లీలావతి’’ చూడటం సాహసం చేయడమే నటీనటులు : లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్, వీకే నరేష్, వీటీవీ గణేష్, మెట్ట రాజేంద్రన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు. దర్శకత్వం : తాతినేని సత్య…

రివ్యూ : ‘గోదారి గట్టుపైన ’ పాజిటివ్ ఫ్యామిలీ డ్రామా

రివ్యూ : ‘గోదారి గట్టుపైన ’ పాజిటివ్ ఫ్యామిలీ డ్రామా నటీనటులు :- సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతిబాబు, లైలా, నెల్లూరు సుదర్శన్, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్ తదితరులు.. దర్శకత్వం :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’