‘‘పెద్ది” పవర్‌ప్లే.. పెద్ద ప్లానింగే

peddi powerplay tour planing :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లాయి. ఇప్పటికే విడులైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన టీమ్.. తాజాగా అప్‌కమింగ్ ప్రమోషనల్ ప్లానింగ్‌కు సంబంధించి ఓ లెటర్‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
“పెద్ది’ సినిమా మాత్రమే కాదు.. ఇదొక తుఫాన్”అంటూ ప్రారంభమైన ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కేవలం ఒక కథ కాదు.. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే అనుభూతి అని టీమ్ చెప్పిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘‘ కల ఎంత పెద్దదైతే… బాధ్యత అంత పెద్దది”అనే లైన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
peddi powerplay tour planing :
‘‘పెద్ది’ పవర్‌‌ప్లే టూర్” పేరుతో సర్‌‌ప్రైజింగ్ టూర్‌‌న ప్లాన్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ ఈవెంట్లు జరగనున్నాయి.
ఈ షెడ్యూల్‌ను పరిశీలిస్తే..
* మే 18 – ముంబై
* మే 22 – ఉప్పల్ స్టేడియం
* మే 23 – భోపాల్
* మే 24 – బెంగళూరు
* మే 28 – ఢిల్లీ
* మే 30 – చెన్నై
* జూన్ 1 – విజయనగరం
* జూన్ 2 – హైదరాబాద్

ఈ టూర్‌తో మూవీ టీమ్ పాన్ ఇండియా స్థాయిలో భారీ బజ్ క్రియేట్ చేయాలని చూస్తోంది. ముఖ్యంగా మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ‘పెద్ది’ టీమ్ చేయబోయే ఈవెంట్‌పై ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరాయి. భారీ జనసందోహం మధ్య రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు.. ‘మరిన్ని సర్‌‌ప్రైజ్‌లు లోడింగ్‌’ అంటూ టీమ్ మరో హింట్ కూడా ఇచ్చింది. దీంతో ట్రైలర్ రిలీజ్, స్పెషల్ గ్లింప్స్, మ్యూజికల్ ఈవెంట్స్‌పై కూడా ఆసక్తి పెరిగింది.
ఇక లెటర్ చివర్లో సినిమా రిలీజ్ డేట్ అయిన జూన్ 4ని ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ.. బండిల్ ఆఫ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ కోస సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు.

peddi powerplay tour planing :
మొత్తానికి ‘పెద్ది’ సినిమాను కేవలం ఒక మూవీలా కాకుండా.. ఓ ఎమోషనల్ సినీ ఈవెంట్‌గా మార్చేందుకు టీమ్ భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తోందని ఈ ప్రమోషనల్ టూర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

 

 

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

One thought on “‘‘పెద్ది” పవర్‌ప్లే.. పెద్ద ప్లానింగే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’