Producers trade insults with personal comments :
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది నిర్మాత నాగవంశీ, ప్రొడ్యూసర్ కమ్ ఎగ్జిబిటర్ ఏషియన్ సునీల్ నారంగ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం. మొదట థియేటర్ పర్సంటేజ్‌లు, సింగిల్ స్క్రీన్స్ – మల్టీప్లెక్స్‌ల చర్చగా మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు పర్సనల్ కామెంట్స్ వరకు వెళ్లిపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఇటీవల మీడియా ముందుకు వచ్చిన నాగ వంశీ, ఎలాంటి పేర్లు ప్రస్తావించకుండా కానీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
Producers trade insults with personal comments :
“కామెడీ చేయడానికి ప్రెస్ మీట్లు పెట్టకండి” అని మొదలుపెట్టిన ఆయన .. “ఆ పెద్దమనిషికి చెప్పండి… ₹10,000కి సినిమాలు వేయలేదని” అంటూ సెటైర్ వేశారు. అంతటితో ఆగకుండా.. ‘‘స్థలం కనిపించిన ప్రతి చోటా మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ వెళ్లిపోయే పెద్దమనిషి, సింగిల్ స్క్రీన్స్ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు?” అంటూ డైరెక్ట్‌గా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై వెంటనే ఏషియన్ సునీల్ రియాక్ట్ అయ్యి.. నాగవంశీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Producers trade insults with personal comments :
“ఒక ప్రొడ్యూసర్ ఉంటారు కదా.. గ్లాసెస్ పెట్టుకుని డూప్లికేట్ హెయిర్ పెట్టుకుంటాడు” అంటూ పర్సనల్ కామెంట్ చేసిన సునీల్.. తమ ఎగ్జిబిషన్ నెట్వర్క్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. స్థలం కనిపించిన ప్రతిచోటా మల్టీప్లెక్స్‌లు కట్టడం లేదని చెబుతూ.. ‘‘మేం 33 సింగిల్ స్ర్కీన్స్ కట్టాం. ఇంకో 5 నిర్మాణంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 500 స్క్రీన్స్ నిర్మిస్తున్నాను. మాట్లాడే హక్కు నాకు లేకపోతే ఇంకెవరికుంది?” అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
అయితే అసలు ట్విస్ట్ తర్వాత వచ్చింది. సునీల్ తన వాట్సాప్ డీపీ మార్చుకుని పెట్టుకున్న కోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ముందుగా ఎప్పుడూ గొడవ మొదలుపెట్టొద్దు. కానీ వాళ్లే బలవంతం చేస్తే పూర్తిగా నాశనం చేయాలి” అనే ఆ డైలాగ్ ఇప్పుడు ఈ వివాదానికి మరింత ఫైర్ జోడించింది.
Producers trade insults with personal comments :
ఇప్పటికే ఈ మాటల యుద్ధం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిబేట్‌గా మారింది. పర్సంటేజ్‌లు, థియేటర్ సిస్టమ్, సింగిల్ స్క్రీన్స్ భవిష్యత్తు గురించి మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఈగో క్లాష్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఇద్దరి మధ్య వార్ ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుందా అన్నది చూడాలి.





