మెగాస్టార్ మరో బ్లాక్ బస్టర్ యాత్ర

మెగాస్టార్ చిరంజీవి మరో బ్లాక్‌బస్టర్ యాత్రకు సిద్ధమవుతున్నారని ఆయన కొత్త మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న చిరంజీవి ఈ సక్సెస్ జోష్‌లోనే నెక్స్ట్ ప్రాజెక్టును మొదలుపెడుతున్నారు. ఆయన తర్వాతి సినిమాను దర్శకుడు బాబీ దర్శకత్వంలో చేయనున్నారు. ఇటీవల ఓ క్రేజీ పోస్టర్‌‌తో ఈ మూవీని అనౌన్స్ చేయగా తాజాగా షూట్ ప్రారంభానికి ముందు.. మంగళవారం లుక్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్ సమయంలో మెగాస్టార్ ఎంతో ఫోకస్‌తో కనిపిస్తున్నారు. కెమెరా ముందు నిలబడి, దర్శకుడు మరియు టెక్నీషియన్స్‌తో చర్చిస్తూ కనిపిస్తున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటో, ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలను అమాంతం పెంచేస్తోంది.
“సైలెన్స్ బిఫోర్ స్లాటర్” అనే ట్యాగ్‌లైన్‌ను బట్టి చూస్తే ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మెగాస్టార్ స్టైల్‌లో మాస్, ఎమోషన్, యాక్షన్ సహా అన్ని కలగలిసిన ప్యాకేజ్‌గా ఈ సినిమా ఉండబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి లుక్ టెస్ట్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ అంతా చిరంజీవి ఫస్ట్ లుక్‌ కోసం ఈగర్‌‌గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే రెగ్యులర్ షూట్‌ స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఇతర నటీనటులు ఎంపికలో మూవీ టీమ్ బిజీగా ఉందని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఎన్‌కే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి కంప్లీట్ మాస్ క్యారెక్టర్ పోషించబోతున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు.

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్