రివ్యూ : పళ్లి చట్టంబి

రివ్యూ : పళ్లి చట్టంబి
నటీనటులు :- టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు
డైరెక్టర్ -: డిజో జోస్ ఆంటోనీ
ప్రొడ్యూసర్స్ : – నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్
ఎడిటింగ్ : – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ : – టిజో టోమీ
మ్యూజిక్ -: జేక్స్ బిజోయ్
విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026
నిడివి : 2 గంటల 11 నిమిషాలు
రేటింగ్ : 2.25

మలయాళ నటుడే అయినా తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ విషయానికొస్తే ..
కేరళ రాష్ట్రంలో తొలిసారిగా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, భూసంస్కరణలను తీసుకొస్తుంది. దీంతో కేరళ–కర్ణాటక సరిహద్దులోని కాణియార్‌ ప్రాంతంలోని కున్నాపురం గ్రామ ప్రజలు, తమ ఊర్లోని చర్చి స్థలాలను కాపాడుకునేందుకు పోతన్‌ క్రిస్టోఫర్‌ పేరిట ఓ వ్యక్తిని తీసుకొచ్చి, తమకు రక్షణగా నియమించుకుంటారు. అతనే చట్టంబి (చట్టంబి అంటే తెలుగులో రౌడీ) కమ్యూనిజం భావజాలం ఉన్న వారి దాడుల నుంచి, కున్నాపురంలోని క్రైస్తవులయినా వారిని క్రిస్టోఫర్‌ పోతన్‌ కాపాడాలి. అదే అతని కర్తవ్యం. క్రిస్టోఫర్‌ పోతన్‌ రాగానే, కమ్యూనిజం భావజాలం ఉన్న జార్జ్‌తో గొడవపడి, గెలుస్తాడు. ఇలా కున్నాపురం గ్రామ ప్రజలకు చేరువ అవుతాడు. ఇందుకు ప్రతి స్పందనగా కున్నాపురంలో రెబెక్కా (కయాదు లోహర్‌)అనే యువతి, ‘మీరు నన్ను కమ్యూనిస్టును చేశారు’ అనే నాటకం ప్రదర్శిస్తుంది. క్రిస్టోఫర్‌ పోతన్‌ ఈ నాటకాన్ని అడ్డుకోకపోగా, రెబక్కాకు సాయం చేస్తాడు. ఇది కున్నాపురం చర్చి పెద్దలకు కోపం తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పోతన్‌ క్రిస్టోఫర్‌ క్రైస్తవుడు కాదని, అతని అసలు పేరు కృష్ణన్‌ పిళ్లై అని తెలుస్తుంది. దీంతో అతన్ని ఊరి నుంచి వెళ్లిపోవాలని కున్నాపురం గ్రామస్థులు చెబుతారు.

మరోవైపు కాణియార్‌ ప్రాంతంలో ఉన్న పరియట్టుమలై అనే కొండ ప్రాంతంలో ఉన్న గోల్డ్‌మైన్స్‌పై కుంజుంబు నంబియార్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) కన్నుపడుతుంది. అది తన పూర్వీకుల ప్రాంతం అని, కాణియార్‌ను హస్తగతం చేసుకోవాలని ప్లాన్‌ చేస్తాడు. మరి.. నంబియార్‌ వేసిన ప్లాన్‌ ఏమిటి? మరోవైపు కున్నాపురం గ్రామానికి కృష్ణన్‌ పిళ్లై మళ్లీ తిరిగొచ్చాడా? అనేది మిగిలిన కథనం.

విశ్లేషణ
కేరళలో 1930లో కుంజుంబు నంబియార్‌ జరిపే ఓ దారుణ మారణహోమం సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత కథ 1950కి మారుతుంది. క్రైస్తవులైనా, కమ్యూనిస్టులైనా, ముంస్లీలు అయినా..ఎవరైనా మనుషులే. మనుషులు అందరూ ఒక్కటే అని సందేశాన్ని దర్శకుడు చెప్పాలనుకునే ప్రయత్నం ఈ సినిమాతో చేశాడు. కున్నాపురం గ్రామానికి హీరో రావడం, అక్కడి గ్రామప్రజలకు చేరువ కావడం, అతని అసలు పేరు బయటకు రావడంతో తొలిభాగం ముగుస్తుంది. కాణియర్‌ ప్రాంతంలో కుంజుంబు నంబియార్‌ వేసిన ప్లాన్‌ అమలు, చేలరేగిన అల్లర్లు వంటి సన్నివేశాలతో సెకండాఫ్‌ సాగు తుంది. సెకండాఫ్‌ క్లైమాక్స్‌ లో మనకు ఇటీవల తెలుగులో వచ్చిన రోషన్‌ ‘ఛాంపియన్‌’ సినిమా గుర్తుకు రావొచ్చు.

తొలిభాగం చాలా రెగ్యులర్‌గానే ఉంటుంది. కృష్ణ పిళ్లై ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిపోడ్‌ సీన్స్‌ ఎమోషనల్‌గా అని పిస్తాయి. ఫస్ట్‌ఫైట్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో కొంత డ్రామా ఉంది. కానీ ఈ డ్రామాలో యాక్షన్‌ మోతాదు ఎక్కువైంది. క్లైమాక్స్‌లో దాదాపు అరగంట పాటు యాక్షన్‌ ఉంటుంది. కాణియార్‌ గోల్డ్‌మైన్‌ సీక్రెట్‌ బయటకు తెచ్చే సీన్స్‌ బాగున్నాయి. యాక్షన్‌ బాగుంది. కానీ సాగదీత ఎక్కువైంది.

కృష్ణన్‌ పిళ్లై అలియాస్‌ పోతన్‌ క్రిస్టోఫర్‌గా టోవినోథామస్‌ మంచి యాక్టింగ్‌ కనబరిచారు. ఎమోషనల్‌ అండ్‌ యాక్షన్‌ సీన్స్‌లో తనదైన యాక్టింగ్‌ చూపించాడు. రెబెక్కాగా కయాదు పాత్ర సడన్‌గా వస్తుంది. అంతే సడన్‌ గా క్లోజ్‌ అవుతుంది. నంబియార్‌గా పృథ్వీరాజ్‌కుమారన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ చాలా అంటే చాలా తక్కువ. పోలీస్‌ రామన్‌గా శత్రుకు ఓ బలమైన రోల్‌ లభించింది. టీజీ రవి, విజయరాఘవన్‌ వంటివారు వారి పాత్రల పరిధి మేరకు యాక్ట్‌ చేశారు.

కులమతాల బేధాభిప్రాయాలు లేకుండా, మనుషులంతా సమానంగా ఒక్కటిగా జీవించాలనే సందేశాన్ని, రాజకీయపరమైన అంశాలతో ముడిపెట్టి చెప్పాడు దర్శకుడు. కథనాన్ని కాస్త వివరంగా ప్రజెంట్‌ చేసి ఉంటే బాగుండేది. కేరళ రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి నచ్చుతుందెమో. టెక్నికల్‌గా ‘పళ్లిచట్టంబి’ సినిమా బాగుంది. కెమెరా విజువల్స్, ఎడిటింగ్, జేబ్స్‌ బిజోయ్‌ సంగీతం బాగున్నాయి.

రేటింగ్ : 2.25

Related Posts

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

రివ్యూ : వాలా 2 నటీనటులు :- హషీర్ హెచ్, అలెన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్, అజిన్ జాయ్, వినాయక్ వి, అష్నా, సాషా ఇస్లా, వేద శంకర్, ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫోన్స్ పుతిరిన్ తదితరులు దర్శకత్వం : సావిన్…

రివ్యూ : తిమ్మరాజుపల్లి టీవీ : అలనాటి జ్ఞాపకాలతో ఆకట్టుకునే తిమ్మరాజుపల్లి టీవీ

రివ్యూ : తిమ్మరాజుపల్లి టీవీ : అలనాటి జ్ఞాపకాలతో ఆకట్టుకునే తిమ్మరాజుపల్లి టీవీ నటీనటులు :- సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని