సమంత లీడ్ రోల్‌లో నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. గురువారం ‘తస్సాదియ్యా’ అనే పాటను విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన పాటను చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఎనర్జిటిక్‌గా పాడారు. ‘‘త త త తస్సాదియ్యా.. చిరునవ్వులు చిందులేయ్య.. మనమాడిందే ఆట.. మనని ఆపేదెవరంట చెలరేగిపో..” అంటూ రెహమాన్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. పెళ్లి వేడుక నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్‌గా మార్చేసింది. రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రంలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మే 15న సినిమా విడుదల కానుంది. ‘ఓ బేబీ’ తరువాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.





