నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవ్వరు అనిపిస్తలే

‘‘ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగ.. ఓ యమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టా ఎట్టాగా..” అంటూ ఫుల్ జోష్‌లో పాడుకుంటున్నాడు అఖిల్. తను హీరోగా ముర‌ళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లెనిన్’ చిత్రంలోని పాట ఇది. అన్నపూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్పణ‌లో మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా..’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా..’ అనే సాంగ్ రెండో పాట‌ విడుద‌లైంది. ఈ మాస్‌ మెలోడీ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేయడంతో పాటు శ్రీకృష్ణతో కలిసి పాడటం హైలైట్‌గా నిలిచింది. ‘‘రెండు కళ్లు సరిపోతలే.. రెప్ప మూయాలి అనిపిస్తలే.. నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవ్వరు అనిపిస్తలే.. నడుమేమో జానెడు జానెడు.. ఆ జడ చూస్తే బారెడు బారెడు.. తల్లో మడిచి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు.. నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు..” అంటూ భాస్కరభట్ల రాసిన చక్కటి సాహిత్యం ఆకట్టుకుంది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొడుతుంటే, భాగ్యశ్రీ తన చార్మ్‌తో స్క్రీన్‌పై మెప్పిస్తోంది. ఈ ఇద్దరి జోడీ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంది. జూన్‌ 26న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కాబోతోంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని