సాహసాల సైనిక.. ఆయుధం నీ వేడుక

‘‘రా రా… ధీవర, లేరా లేవరా విజృంభించరా.. స్వప్నం సాధించరా, నువ్వే నీ ఉలి, నువ్వే నీ శిల, నీలో శక్తిని శిల్పంగా మార్చారా..” అంటూ పవర్‌‌ఫుల్ సాంగ్‌తో ఆకట్టుకున్నారు నిఖిల్. ఆయన హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ చిత్రంలోని పాట ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా, మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని మొదటిపాటను విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రూర్ కంపోజ్ చేసిన ఈ పాట పవర్ ఫుల్ డ్రమ్స్, ఆర్కెస్ట్రా లేయర్స్‌తో పాట ఒక యోధుడి నినాదంలా అనిపిస్తుంది. సంతోష్ వెంకీ వోకల్స్ పవర్‌ను మరింత పెంచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ధైర్యం, సంకల్పం, యోధుని ఆత్మను ప్రతిబింబిస్తాయి. ‘‘సాహసాల సైనిక.. ఆయుధం నీ వేడుక.. ఏలుకోరా నాయకా, కాలమే నీ వేదిక.. ఉక్కు రెక్కలే చెక్కుతున్నవి తీర్చిదిద్దగా నీలాంటి నిన్ను.. ఇష్టకష్టమే ఆశయానికీ వెన్నుదన్ను..నీ దీక్షలోనా చిందుతున్న స్వేదమూ వీరగంధమే.. నీ శక్తి దాటి పెంచుకున్న శౌర్యము పాఠ్యగంధమే.. అహో స్వయంభు సైనికా..”అంటూ సాగిన పాటలో నిఖిల్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్ లుక్, యుద్ధానికి సిద్ధమైన బాడీ లాంగ్వేజ్, ఖడ్గాలతో చేసే యాక్షన్ ఫైట్స్.. కఠిన సాధనను చూపిస్తున్నాయి. ఆయన చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. హై ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్‌తో కూడా ఆకట్టుకుంటారు. నభా నటేశ్ ఈ పాటలో కనిపిస్తూ విజువల్ మరింత ఆకర్షణ తెచ్చారు. సినిమా గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. కేకే సెంథిల్ కుమార్ అద్భుతమైన విజువల్స్‌తో భారీ సెట్లు, యుద్ధభూములు, యోధుల గుంపులను అద్భుతంగా చూపించారు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్‌ను భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు, స్టేజింగ్,యు స్క్రీన్‌పై కనిపించే ఎనర్జీ అన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. విజే బిన్నీ మాస్టర్ కొరియోగ్రఫీ వార్ డ్యాన్స్ రిథమ్‌తో కలిపి ‘రా రా ధీవర’ను ఒక గొప్ప వేడుకగా నిలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్స్ ఎం. ప్రభాహరణ్, రవీంద్ర రూపొందించిన సెట్స్, పీరియడ్ డిటైలింగ్ సినిమాకు మరింత వైభవాన్ని తీసుకువచ్చాయి. ప్రతి అంశం కలిపి ఒక భారీ ప్రపంచాన్ని సృష్టించాయి. ఈ మ్యూజికల్ లాంచ్‌తో ‘స్వయంభూ’ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ఇప్పుడు ఈ పాటతో మరింత హైప్ క్రియేట్ చేసింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విజయ్ కామిశెట్టి డైలాగ్స్ అందించడంతో పాటు కో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, ఠాగూర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. త్వరలోనే పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 6 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని