ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లకంటే తమ సినిమా ‘పాపం ప్రతాప్’ ఆడియెన్స్‌ను ఎక్కువ అలరిస్తుందని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు తిరువీర్. తను హీరోగా ఎస్‌పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మదిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే .. చిన్నప్పట్నుంచీ ప్రతాప్ (తిరువీర్), బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లయిన మూడు రోజులకే ప్రతాప్ భార్య ఊరి పంచాయితీ వేదికగా తనను వదిలేసి వెళ్లిపోతుంది. తనకొక సమస్య ఉందని, దాన్ని తెలుసుకుని, సమస్యను పరిష్కరించుకుంటేనే తిరిగి వస్తానని చెప్పేస్తుంది. ఈ క్రమంలో ప్రతాప్ తండ్రి (అజయ్ ఘోష్), బుజ్జమ్మ తండ్రి (దేవి ప్రసాద్) మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. దీంతో తన కొడుక్కి మరో పెళ్లి చేయాలనుకుంటాడు అజయ్ ఘోష్. ఇది ప్రతాప్‌కు, తన తల్లికి నచ్చదు. చక్కనైన కోడలు ఉండగా, మరో పెళ్లి ఏంటి అంటూ… బ్రతిమాలి తీసుకురావాలని రాశి చెబుతుంది. మరోవైపు ప్రతాప్ తన ఫ్రెండ్ ద్వారా తనకున్న సమస్యను తగ్గిందని తెలుసుకుంటాడు. వెంటనే తన భార్య బుజ్జమ్మ దగ్గరకు వెళ్లి బ్రతిమాలుతూ.. తన సమస్య తగ్గిపోయిందని చెప్పడంతో ప్రతాప్‌తో కలిసి భర్త ఇంటికి చేరుకుంటారు. కానీ తెల్లారేసరికి ఒక లెటర్ రాసి మళ్లీ వెళ్లిపోతుంది. నీ సమస్య తగ్గిందని అబద్దం చెప్పడంతోనే తాను వెళ్లిపోతున్నట్టు లెటర్‌లో రాస్తుంది. వెంటనే మరోసారి తన భార్య దగ్గరకు వెళ్లి నిలదీయగా, అసలు తనకున్న సమస్య చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. ఆమెను అక్కడ వదిలేసి ఒక్కడే వచ్చేస్తాడు. అసలు ప్రతాప్‌కు ఉన్న సమస్య ఏంటి..? వీర ప్రతాప్ అని కొన్ని సార్లు, పాపం ప్రతాప్ అని కొన్ని సార్లు ఊరి జనం అంతా తనను ఎందుకు అంటారు.. తన సమస్యను తగ్గించుకోవడానికి ప్రతాప్ ఏం చేశాడు, భార్యభర్తలు మళ్లీ కలిశారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. ఈ సినిమా మొత్తం నైంటీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండటంతో అప్పటి పల్లెటూరి విజువల్స్ సినిమాకు ఫ్రెష్ ఫీల్‌నిస్తాయి. కానీ కథ మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోకి ఉన్న సమస్యను కన్విన్సింగ్‌గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడనిపిస్తుంది. అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా, గోపరాజు రమణ, రఘు బాబు, బాషా లాంటి కామెడీ ఆర్టిస్టులతో ఫన్నీ సీన్స్ ఇరికించినా అవి పెద్దగా వర్కవుట్ అవ్వవు. మధ్యలో షకీలాతో వచ్చే బీ గ్రేడ్ సీన్స్, డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియెన్‌కు చిరాకు పుట్టిస్తాయి. రొటీన్ కథకు తోడు తేలిపోయే కథనం ఎక్కడా సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించదు. కేఎమ్ రాధా కృష్ణ, సురేష్ బొబ్బిలి కలిసి సంగీతం అందించినా, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, రెహమాన్ లాంటివారు లిరిక్స్ అందించినా పాటలు కూడా గుర్తిండిపోయేలా లేవు. సినిమాటోగ్రాఫర్ విశ్వేశ్వర్ ఎస్.వి అందించిన విజువల్స్ మాత్రం పర్వాలేదనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే.. కథ,కథనం ఎలా ఉన్నా నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రతాప్‌గా తిరువీర్ తనదైన నటనతో మెప్పించారు. అలాగే బుజ్జమ్మగా పాయల్ రాధాకృష్ణ సంప్రదాయంగా కనిపిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక ప్రతాప్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రాశి తన పరిధిమేర నటించారు. అజయ్ ఘోష్ అక్కడక్కడ తనదైన హ్యాసాన్ని పండించారు. గోపరాజు రమణ, ప్రసాద్ బెహరా, బాషా, అనంత్ బాబుల పాత్రలకు అంతగా ప్రాధ్యానత ఉండదు.
ప్లస్‌లు :
తిరువీర్, పాయల్ రాధాకృష్ణ నటన
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ విజువల్స్
మైనస్‌లు :
కథ, కథనం
పండని ఎమోషన్
కొన్ని బూతు డైలాగ్స్
ఫైనల్‌గా : పాపం ప్రేక్షకులు సినిమా చూడాలంటే కాస్తంత సహనంగా ఉండాలేమో అనిపిస్తుంది.
రేటింగ్: ⭐⭐ (2/5)






