నితిన్ నుంచి సందీప్ కిషన్‌కు చేరిన ‘పవర్‌‌ పేట’

నితిన్ నటించాల్సిన సినిమాలన్నీ ఇప్పుడు పక్కదారి పడుతూ వేరొక హీరోలతో ఆ సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ‘యల్లమ్మ’ విషయంలో నితిన్ ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేరగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు విషయంలోనూ నితిన్ తప్పుకోవడంతో అందులోకి మరో యంగ్ హీరో సందీప్ కిషన్ జాయిన్ అయ్యాడు. దాదాపు రెండేళ్ల క్రితం లిరిసిస్ట్ కృష్ణ చైతన్య నితిన్‌తో ‘పవర్ పేట’ సినిమాను ప్రకటించారు. ఇదొక భారీ యాక్షన్ డ్రామా అని, దీన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. తీరా చూస్తే కొన్నాళ్లుగా ఈ సినిమా గురించి ఎలాంటి చడీచప్పుడు లేదు. మూలనపడ్డ ప్రాజెక్టుల్లో ఇదొకటి చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ అనూహ్యంగా గురువారం ‘పవర్‌‌పేట’ టైటిల్‌తోనే హీరోను మారుస్తూ అనౌన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి సందీప్ కిషన్ ఎంటర్ అయ్యినట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ప్రెస్ట్రీజియస్‌గా నిర్మిస్తున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రక్తంతో నిండిన చెస్ బోర్డ్‌పై నలిగిన గులాబీతో ఉన్న పోస్టర్ కథపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అలాగే లవ్, హానర్, పాలిటిక్స్ అంటూ ఈ పోస్టర్‌‌పై క్యాప్షన్ ఇవ్వడం మరింత ఆసక్తిని పెంచింది. గతంలో విశ్వక్‌సేన్‌తో ‘గ్యాంగ్స్ఆఫ్ గోదావరి’ తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య విభిన్న జానర్లను కలిపి ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. కథతో పాటు టెక్నికల్ గా కూడా ‘పవర్ పేట’ బలంగా నిలుస్తోంది. సంగీతాన్ని మణిశర్మ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను మధీ నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. సౌండ్ డిజైన్‌ను సచిన్ సుధాకరన్, హరిహరన్ రూపొందిస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులతోపాటు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. ఇదిలాఉంటే ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు సంజయ్ జాసన్ రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’ చిత్రంలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని