KiranAbbavaram Reality Second Song Ruththu Out
వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తూ, రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిత్రం ‘రియాలిటీ’. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవికా భట్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘భజగోవిందం’ పాటకు అద్భుతమైన స్పందన రావడంతో తాజాగా రెండో పాట ‘రుత్తూ’ను మూవీ టీమ్ విడుదల చేసింది.
భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రూపొందిన ఈ మెలోడీ సాంగ్ ప్రేమలోని మధురమైన భావాలను ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటోంది. పూర్ణాచారి సాహిత్యం, కపిల్ కపిలన్ గాత్రం, కిరణ్ అబ్బవరం–దేవికా భట్ జంట కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
KiranAbbavaram Reality Second Song Ruththu Out
ఈ సందర్భంగా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘భజగోవిందం’ పాటను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ప్రేమతో మంచి కుటుంబ కథను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ‘రియాలిటీ’ కథను రాసుకున్నానని చెప్పారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, డిసెంబర్ 25న థియేటర్లలో ప్రేక్షకులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని, ఈ సినిమా విషయంలో పేరు వచ్చినా, బ్లేమ్ వచ్చినా నాదే బాధ్యత అని అన్నారు.
నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ.. కేవలం 53 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని, మంచి కుటుంబ విలువలతో కూడిన కథతో సినిమా రూపొందిందని తెలిపారు. హీరోయిన్ దేవికా భట్ తన తొలి సినిమా కావడం ఎంతో ప్రత్యేకమని ఆనందం వ్యక్తం చేశారు.
శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2026న ‘రియాలిటీ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘రియాలిటీ’ సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీ



