Idhupu Kayitham Teaser Launch Event
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Idhupu Kayitham Teaser Launch Event
తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘ఇడుపు కాయితం’ చాలా మంచి ఫ్యామిలీ డ్రామా అని, మన ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను వినోదాత్మకంగా చూపిస్తూ నవ్విస్తూనే ఆలోచింపజేస్తుందని అన్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు తమ అత్తమామలతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరారు. నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని భార్య అడిగే ప్రశ్నకు ఏ భర్త దగ్గరా సమాధానం ఉండదు. ఈ సినిమాలో మాత్రం ఆ ప్రశ్నకు ఒక క్యూట్ ఆన్సర్ వస్తుందని అన్నారు.
నిర్మాత తబిత సుకుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు వంశీరెడ్డి కథను ఎంత అందంగా చెప్పాడో, అంతే అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసించారు. పెళ్లి సంప్రదాయాలు, కుటుంబాల్లో జరిగే సంభాషణలు, బంధాల మధ్య ఉండే భావోద్వేగాలను ఈ సినిమాలో సహజంగా చూపించారని తెలిపారు.
దర్శకుడు వంశీరెడ్డి మాట్లాడుతూ.. విడిపోవడానికి రాసుకునే పత్రంగా మాత్రమే కాకుండా, విడిపోయిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక సర్టిఫికెట్లా ‘ఇడుపు కాయితం’ను చూడాలన్నది తన ఉద్దేశమని వివరించారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ అని, నిజాయితీగా చెప్పిన ఫ్యామిలీ డ్రామా అందరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.
హీరోయిన్ నాగదుర్గ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోందని, సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఇడుపు కాయితం’ టీజర్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన చిత్ర బృందం. నిర్మాతలు బన్నీ వాస్, తబిత సుకుమార్, హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ, దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి సహా చిత్ర యూనిట్ సభ్యుల ఫొటోలు మీకోసం..
Idhupu Kayitham Teaser Launch Event Photos




