Kamal Haasan SandiyarBack Story
విలక్షణ నటనకు, ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కమల్ హాసన్ మరోసారి తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథ, పాత్ర మాత్రమే కాదు.. సినిమా టైటిల్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకీ ‘సండియార్’ అంటే ఏంటి? ఈ టైటిల్ వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి?
Kamal Haasan SandiyarBack Story
దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సండియార్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. సాధారణంగా సండియార్ అనే పదానికి ధైర్యవంతుడు, పోరాట యోధుడు, రౌడీ లేదా భయపడని వ్యక్తి అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలకు తగ్గట్టుగానే కమల్ హాసన్ పాత్ర ఉండబోతోందనే సంకేతాలను ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చింది.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, గ్రే గడ్డం, షార్ట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్న కమల్ హాసన్.. ఓ వాహనం కిటికీకి ఆనుకుని తీక్షణంగా చూస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. వాహనంపై రక్తపు మరకలు, ఆయన ముఖంలో కనిపిస్తున్న ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సినిమాలో యాక్షన్, వైలెన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. ప్రశాంతంగా కనిపిస్తూనే ప్రత్యర్థులకు వణుకు పుట్టించే పాత్రలో ఆయన కనిపించనున్నట్లు పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ‘సండియార్’ టైటిల్‌తో కమల్ హాసన్‌కు దాదాపు 22 ఏళ్ల అనుబంధం ఉంది. గతంలో ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విరుమాండి’ సినిమాకు మొదట ఈ టైటిల్‌నే అనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో అప్పట్లో ఆ పేరు ఖరారు కాలేదు. ఇన్నేళ్ల తర్వాత అదే టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.
‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ, కె.ఎస్. సునీల్ సినిమాటోగ్రఫీ, సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి 22 ఏళ్ల క్రితం తెరపైకి రాలేకపోయిన ఓ టైటిల్ ఇప్పుడు కమల్ హాసన్ చేతిలోకి రావడం.. ఆయన పవర్ఫుల్ లుక్కు అదే పేరు సరిపోవడంతో ‘సండియార్’పై ఇప్పటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది.