Chandrayaan Movie Gets U/A Certificate
‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే ‘చంద్రయాన్’. హిలేరియస్ అడ్వెంచర్ కథాంశంతో, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ నెల 30న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Chandrayaan Movie Gets U/A Certificate
గ్రామీణ నేపథ్యంలో సరికొత్త కథ, ఆసక్తికరమైన కథనంతో రూపొందిన ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని మేకర్స్ వెల్లడించారు. సినిమా చూసిన సెన్సార్ టీమ్ కూడా చిత్రంలోని కథా కథనాలను ప్రశంసించినట్లు తెలియజేశారు.
శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సింబా స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. అందులోని అడ్వెంచర్ అంశాలు, వినోదభరితమైన కథా నేపథ్యం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కేవలం టైటిల్‌తోనే కాకుండా, తన విభిన్నమైన కథాంశంతోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ‘చంద్రయాన్’ థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
గ్రామీణ వాతావరణం, హాస్యం, అడ్వెంచర్ అంశాల కలయికతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 30న థియేటర్లలోకి రానున్న ‘చంద్రయాన్’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో ఆసక్తికరంగా మారింది.