Nithin Alias Rukmini Locks Release Date
టాలీవుడ్లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నితిన్‌కు గత కొంతకాలంగా సరైన బాక్సాఫీస్ విజయం దక్కడం లేదు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’పై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోన్న సందర్భంగా మరింత ఆకర్షణగా నిలిచింది.
శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఎండింగ్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేలా డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ ప్రకటనతో పాటు అక్టోబర్ 13న రుక్మిణి పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Nithin Alias Rukmini Locks Release Date
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా ఇప్పుడు విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో ప్రమోషన్ల దిశగా ముందడుగు వేసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి కథ, రుక్మిణి పాత్రలో కనిపించబోయే హీరోయిన్ వివరాలు ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్ 13న రుక్మిణి ఎవరో రివీల్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది.

నితిన్ కెరీర్లో ప్రేమకథలకు ప్రత్యేక స్థానం ఉంది. యువతకు చేరువయ్యే పాత్రలు, భావోద్వేగాలతో కూడిన కథలు ఆయనకు గతంలో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’ కూడా ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతుండటంతో, మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్లో ప్రేక్షకులను పలకరించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదొక అందమైన ప్రేమకథ అని, ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునేలా ఉంటుందని నాని అన్నారు. నితిన్ నటించిన జయం, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలను ప్రేక్షకులు ఎంతలా ప్రేమించారో, ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ప్రేమించేలా చేస్తుందని చెప్పడం మరింత ఆసక్తిని పెంచుతోంది. తన కెరీర్లో ఈ చిత్రం చాలా స్పెషల్‌గా నిలుస్తుందని నితిన్ అన్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ, సృజన ఆదుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.