Crazy Kalyanam Arrives Early
టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ సినిమా రిలీజ్ విషయంలోనూ సర్ప్రైజ్ ఇచ్చింది. ముందుగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని రెండు వారాలు ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. దీంతో అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘క్రేజీ కళ్యాణం’ సిద్ధమైంది. కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
Crazy Kalyanam Arrives Early
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని బద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్నారు. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సినిమాలోని లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్‌ను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
ముందుగా అక్టోబర్ 30న రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడు రెండు వారాలు ముందుగానే అక్టోబర్ 16న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. దీంతో ‘క్రేజీ కళ్యాణం’ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు ఈ కొత్త రిలీజ్ డేట్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
అనుపమ పరమేశ్వరన్, అఖిల్ ఉడ్డెమారి, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే వంటి విభిన్నమైన నటీనటుల కాంబినేషన్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇప్పటికే ఏర్పడిన బజ్.. ముందస్తు రిలీజ్‌తో మరింత పెరిగే అవకాశముంది.
మొత్తంగా అక్టోబర్ 30 నుంచి అక్టోబర్ 16కి షిఫ్ట్ అయిన ‘క్రేజీ కళ్యాణం’.. రెండు వారాల ముందుగానే థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఈ క్రేజీ కళ్యాణం ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.