Renu Desai Returns with ‘Kashi Majili’
చాలా కాలం తర్వాత నటి రేణు దేశాయ్ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ‘కాశీ మజిలీ’పై ఆసక్తి నెలకొంది. జె.కె. ఆర్ట్స్ బ్యానర్‌పై కాళ్ళూరు జగదీష్ కుమార్ నిర్మించిన ఈ వెబ్ ఎపిసోడ్‌కు 600కు పైగా యాడ్స్‌కు దర్శకత్వం వహించిన యమునా కిశోర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వెబ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
Renu Desai Returns with ‘Kashi Majili’
ట్రైలర్లో రేణు దేశాయ్ లుక్, నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాలా సంవత్సరాల తర్వాత ఆమెను ఇలా చూడటం అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. అదే సమయంలో ఆమె పాత్రలో చూపించిన ఎమోషన్స్, సహజమైన నటన ట్రైలర్‌పై అంచనాలను పెంచుతున్నాయి.

‘కాశీ మజిలీ’కి కథ, చిత్రానువాదం, డైలాగ్స్‌ను కూడా రేణు దేశాయ్ అందించడం విశేషం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి ఏర్పడింది. శంకర్ ఇందుచూడన్ కథానాయకుడిగా నటించారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. డైలాగ్స్ పర్యవేక్షణ బాధ్యతలను అబ్బూరి రవి నిర్వహించారు.
రానా సినిమాటోగ్రఫీ అందించగా, డా. జోశ్యభట్ల సంగీతం సమకూర్చారు. మీర్ S ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆదిత్య గంగాధర్ (స్క్రిప్ట్), హర్షవర్ధన్ సాధనాల (షూట్ ఎగ్జిక్యూషన్) అసోసియేట్ డైరెక్టర్లుగా పనిచేశారు.
ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుండటంతో ‘కాశీ మజిలీ’ ఎపిసోడ్ కోసం రేణు దేశాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 13 ఈ ఆదివారం ఈటీవీ విన్లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.