నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని హీరో హీరోయిన్లుగా ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘‘గుడ్ టైం’’. సన్ స్టూడీయోస్, లహరి మ్యూజిక్ ఆధ్యర్యంలో తాజాగా గుడ్ టైం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణారెడ్డి, లక్ష్మణ్ గుంటూరు, వంశీ నందిపాటి, శశికిరణ్ తిక్క, నందు, ఐశ్వర్య పాల్గొని.. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ గుడ్ టైం రావాలని కోరారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘యాక్టర్ అవ్వాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, మధ్యతరగతి నుంచి వచ్చిన నాపై నమ్మకం పెట్టుకున్న డైరెక్టర్ చాణక్య, నిర్మాత రమేష్ ఇద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆరేళ్ల క్రితమే నా సినీ ప్రయాణం మొదలైనా.. ఇప్పుడు గుడ్ టైం వచ్చింది. సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
హీరోయిన్ అన్యుక్త నలాని మాట్లాడుతూ… ‘దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యా. ఇకనుంచి మా గుడ్ టైం మొదలైంది’ అని చెప్పారు.
నిర్మాత రమేష్ జిల్లా మాట్లాడుతూ.. టీజర్ లంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. గుడ్ టైం సినిమాతో టీంకు గుడ్ టైం వస్తుందని పేర్కొన్నారు.
డైరెక్టర్ చాణక్య జిల్లా మాట్లాడుతూ.. మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు విచ్చేసిన మీడియా మిత్రులకు, ముఖ్య అతిథులకు, చిత్ర యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తర్వాత అందరి టైం గుడ్ గా మారుతుంది అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుందని దాన్ని అందరూ థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారంటూ తెలిపారు.
హీరో నందు మాట్లాడుతూ.. టీజర్ నచ్చితేనే మూవీ ప్రమోషన్స్ కు వస్తా అని మాటిచ్చా.. ఈరోజు వచ్చా, నిజంగా గుడ్ టైం మూవీ టీజర్ చాలా బాగా నచ్చిందన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి లేదు కంటెంట్ బాగుంటే చాలు అని తెలిపారు. గుడ్ టైం సినిమాలో అందరూ మల్టీట్యాలెంటెడ్ లా ఉన్నారని తెలిపారు. సినిమా చాలా వైబ్ ఉండబోతుందని తెలిపారు. టీజర్ చూస్తే కోమా షాట్, బోరాన్ బ్లాస్ట్ లా అనిపించిందని హైదరాబాద్ స్టైల్ లో చెప్పారు. సినిమా తీయడం ఒక ఎత్తు, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ఒక ఎత్తు అని, సినిమాను లాస్ట్ మినిట్ వరకు ప్రమోట్ చేస్తూనే ఉండండి అని గుడ్ టైం టీమ్ కు చెప్పారు.
యు ఎఫ్ ఓ జోనల్ హెడ్ లక్ష్మణ్ గుంటూరు మాట్లాడుతూ… గుడ్ టైం సినిమాకు ఇక్కడి నుంచి మంచి టైం మొదలవుతుందని, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఇది గుడ్ టైం అని తెలిపారు. చిన్న సినిమాలు ఈ సమయంలో అద్భుతంగా ఆడుతున్నాయని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం డైరెక్టర్ చాణక్య తనకు కథ చెప్పి, సినిమా పేరు గుడ్ టైం అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది మా గుడ్ టైం నడుస్తుంది అని అప్పుడే అనిపించింది అని తెలిపారు. సినిమా అవుట్ పుట్ చూసి కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు తెలిపారు. మూవీ టీమ్ అందరికీ ఇది గుడ్ టైం అని తెలిపారు.