MM Keeravani Rides Rahul Sipligunj Dream Bike
సింగర్‌గా తనదైన ముద్ర వేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. తన సంగీత ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించే ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో గడిపిన అరుదైన క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
MM Keeravani Rides Rahul Sipligunj Dream Bike
రాహుల్ షేర్ చేసిన ఫొటోల్లో ఎంఎం కీరవాణి ఆయన డ్రీమ్ బైక్‌పై రైడర్ సీట్లో కూర్చుని కనిపించగా, రాహుల్ వెనుక నిలబడి ఆనందంగా పోజులిచ్చాడు. మరో ఫొటోలో ఇద్దరూ కలిసి షూట్ మానిటర్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నట్లు కనిపించారు. ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

MM Keeravani Rides Rahul Sipligunj Dream Bike
ఈ ఫొటోలతో పాటు రాహుల్ హృదయాన్ని హత్తుకునే క్యాప్షన్‌ను కూడా పోస్ట్ చేశాడు. ‘‘కీరవాణి గారి సంగీతాన్ని ఒకప్పుడు అభిమానిగా చూసిన నేను, ఇప్పుడు నా కలల బైక్‌పై ఆయనే కూర్చోవడం జీవితంలో ఒక కంప్లీట్ సర్కిల్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తోంది. నా సంగీత ప్రయాణానికి తెలియకుండానే స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఇప్పుడు నా కలలలో ఒకటైన బైక్‌పై రైడర్ సీట్లో కూర్చోవడం మాటల్లో చెప్పలేని ఆనందం. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. రాహుల్ పోస్ట్‌పై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ, గురు-శిష్యుల అనుబంధానికి ఇది అద్భుతమైన ఉదాహరణ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సంగీతంతో ప్రారంభమైన ఈ అనుబంధం ఇప్పుడు జీవితంలో మరింత ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారిందని కామెంట్లు చేస్తున్నారు.