Satyadev Samavarthi shooting in deep forest
వైవిధ్యమైన కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సమవర్తి”. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ (మేకింగ్ వీడియో) ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో సినిమా కోసం చిత్ర బృందం ఎంత సాహసోపేతంగా పని చేసిందో చూపించారు. విష సర్పాలు, క్రూర మృగాలు సంచరించే ప్రమాదకరమైన అడవుల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం విశేషంగా నిలిచింది. సౌత్ ఇండియాలోని ఏడు అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటివరకు ఎవరూ చిత్రీకరణ చేయని 42 విభిన్న లొకేషన్లలో షూటింగ్ జరిపినట్టు మేకర్స్ వెల్లడించారు.
వీడియోలో వినిపించిన “సృష్టికైనా, వినాశనానికైనా ఒక పిలుపు రావాలి… ఒక పోరాటం పుట్టాలి… ఒక చిన్న యుద్ధం జరగాలి…” అనే డైలాగ్ కథలోని ప్రధాన సంఘర్షణను ప్రతిబింబిస్తోంది. చివర్లో వచ్చే “ఇక్కడ స్వర్గానికైనా చావే కావాలి తమ్ముడు..” అనే హుక్ లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Satyadev Samavarthi shooting in deep forest
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ముఖ్యంగా “ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్” అనే కొత్త జానర్ ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ హీరోగా మరోసారి తన వైవిధ్యాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రంలో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ నాగ్.వి దర్శకత్వం వహిస్తున్నారు. రుద్ర పిక్చర్స్ బ్యానర్‌తో కలిసి పంచభూత ప్రొడక్షన్స్‌పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు.