Telugu Travel Content ‘Vihari OTT’ Grand Entry in June :
ప్రపంచ సినీ రంగం దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో ఓ కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. ట్రావెల్ కథనాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘విహారి’ ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రివ్యూలో ‘విహారి OTT’ గ్లోబల్ విజన్‌ను ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీసత్య ఆవిష్కరించారు. ఈ వేదికగా విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
దాదాపు 18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, టెలివిజన్‌లో అనేక దేశాలు, పర్యాటక ప్రదేశాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, స్థానిక రుచులు, అపురూప అనుభవాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. ప్రయాణాన్ని కేవలం టూర్‌గా కాకుండా ఓ భావోద్వేగ అనుభూతిగా చూపించడంలో విహారి తనదైన గుర్తింపు సంపాదించింది.
Telugu Travel Content ‘Vihari OTT’ Grand Entry in June :
ఇప్పుడు అదే అనుభూతిని మరింత విస్తృత స్థాయిలో అందించేందుకు ‘విహారి OTT’ సిద్ధమవుతోంది. ట్రావెల్‌కే అంకితమైన తెలుగు తొలి OTT ప్లాట్‌ఫామ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ డిజిటల్ వేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక గమ్యస్థానాలు, కల్చరల్ స్టోరీస్, ఫుడ్ జర్నీస్, అడ్వెంచర్ అనుభవాలు, ఎక్స్‌క్లూజివ్ ట్రావెల్ డాక్యుమెంటరీలు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు ప్రేక్షకుల ట్రావెల్ వీయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరోస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందిన ‘విహారి OTT’ జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. తెలుగు ట్రావెల్ కంటెంట్‌ను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టే ఈ ప్రయత్నం డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలకనుంది.