Rajendra Prasad Nenevaru Film release on May 29 :
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్లో నటించిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘నేనెవరు?’. నువ్వేకావాలి, ప్రేమించు వంటి సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన సాయికిరణ్, జోగిని శ్యామల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రచనతో పాటు దర్శకత్వం వహించారు. సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Rajendra Prasad Nenevaru Film release on May 29 :
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఆకట్టుకునేలా ఉండబోతుందని చిత్రయూనిట్ తెలియజేసింది. ఈ చిత్రం మే 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. డా. రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో కూడిన విభిన్నమైన పాత్రలో కనిపించనుండగా, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. ‘నేనెవరు?’ అనే టైటిల్‌కు తగ్గట్టుగా ప్రతి మనిషి జీవితానికి సంబంధించిన ఒక అంతర్ముఖ ప్రశ్నను ప్రతిబింబించే కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ముఖ్యంగా చిత్రంలోని క్లైమాక్స్, రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉండబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది. టెక్నికల్‌గా కూడా సినిమా ఉన్నత ప్రమాణాలతో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖుల కోసం నిర్వహించిన ప్రివ్యూ షోల అనంతరం మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం విడుదల రోజున ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది మూవీ టీమ్. చిన్ని కృష్ణ సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ మాటలు, ఎస్ఎస్ వీరు పాటలు రాశారు. నందమూరి హరి, తారకరామారావు ఎడిటర్‌గా, నాయుడు ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.