Vardhan Dominates The Traitors
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ‘ది ట్రేటర్స్’ షో రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతోంది. ఇప్పటివరకు విడుదలైన ఆరు ఎపిసోడ్లు మైండ్ గేమ్స్, ఊహించని మలుపులు, వ్యూహాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తాజా ఎపిసోడ్లో రాహత్ ఎలిమినేషన్ గేమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో తనదైన వ్యూహాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జె.ఎస్.ఎస్. వర్ధన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.
Vardhan Dominates The Traitors
‘గీతా సుబ్రహ్మణ్యం’, ‘హలో వరల్డ్’ వంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న వర్ధన్.. ‘భలే ఉన్నాడే’, ‘బ్యూటీ’ వంటి చిత్రాలకు రచన, దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘ది ట్రేటర్స్’లోనూ తన తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనలతో ఆకట్టుకుంటున్నారు. ప్యాలెస్‌లో జరిగే టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ, బుద్ధిబలంతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు.
చిన్మయి, నిఖిల్, గౌరవ్ వంటి కంటెస్టెంట్లతో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత ట్రేటర్స్‌ను గుర్తించడంపై వర్ధన్ మరింత దృష్టి పెట్టారు. విద్యులేఖపై అనుమానాలను వ్యక్తం చేయడంతో పాటు, ఆమె ఎలిమినేషన్‌కు దారితీసిన వ్యూహాల్లోనూ కీలక పాత్ర పోషించారు.
తాజా ఎపిసోడ్లో రాహత్ అనుసరించిన గేమ్ ప్లాన్‌ను ఇతర కంటెస్టెంట్లకు వివరించడంలో వర్ధన్ చూపించిన విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. తనకు వ్యతిరేకంగా ఉన్న మోనిషాను అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతోనే రాహత్ ఆమెను ఎంచుకున్నాడని వర్ధన్ విశ్లేషించారు. ఇతరులు గుర్తించని అంశాలను ప్రస్తావిస్తూ రాహత్ వ్యూహంపై అనుమానాలను బలంగా వినిపించారు.
చివరకు రాహత్ ఎలిమినేషన్‌తో వర్ధన్ గేమ్‌పై చర్చ మరింత పెరిగింది. అయితే, బలమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడం ఆయనకు ఎంత ప్లస్ అవుతుందో.. ప్రత్యర్థుల టార్గెట్‌గా మారడం అంతే ప్రమాదకరంగా కనిపిస్తోంది.

నాలుగు, ఐదు, ఆరు ఎపిసోడ్లలో వర్ధన్ పేరు తరచుగా వినిపించడం ఆయన ఆటకు లభిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. మరోవైపు, హిట్ లిస్ట్‌లోనూ ఆయన పేరు ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
“మై డియర్ ట్రేటర్.. దమ్ముంటే ఈరోజు రాత్రి నన్ను బతికించు\! రేపు మాత్రం నేను నిన్ను చంపేస్తా\!” అంటూ వర్ధన్ చేసిన సవాల్ తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది. హిట్ లిస్ట్‌లో ఉన్న వర్ధన్‌తో పాటు శ్రావ్య, ధనుంజయ్‌లు కూడా ఆషికా కత్తికి దగ్గర కావడంతో ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు ఆరు ఎపిసోడ్లు ఒక ఎత్తు అయితే, చివరి ఎపిసోడ్ మాత్రం ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరి వర్ధన్ తన వ్యూహాలతో ఈ ముప్పు నుంచి బయటపడతారా? గేమ్‌లో మరింత ముందుకు సాగుతారా? ఈ ఉత్కంఠకు సమాధానం తెలియాలంటే వచ్చే గురువారం వరకు వేచి చూడాల్సిందే!.