Sriram’s ‘The Maze’ First Look Unveiled
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది మేజ్’. డాక్టర్ నైమిష్ రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.
Sriram’s ‘The Maze’ First Look Unveiled
తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. పోస్టర్లో కనిపించిన ఇంటెన్స్ విజువల్స్, డార్క్ టోన్, థ్రిల్లింగ్ ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇందులో శ్రీరామ్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రధారులు ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తున్న మహానగరం, అందరూ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో కనిపించడం సినిమాకు ఓ మిస్టీరియస్ ఫీల్‌ను తీసుకొచ్చింది. పోస్టర్‌ను చూస్తే ఇది సాధారణ థ్రిల్లర్ కాకుండా, ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకునే సైకలాజికల్ థ్రిల్లర్ అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ.. ‘వాస్తవం, భ్రమ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ ప్రేక్షకులను ప్రతి క్షణం ఆలోచింపజేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘ది మేజ్’ రూపొందుతోంది. జెయింట్ వీల్ ప్రయాణంలా ఎప్పటికప్పుడు ఉత్కంఠను పెంచే కథతో సినిమా సాగుతుంది. చివరి క్షణం వరకు తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం నిలిచిపోతుంది’ అని తెలిపారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, శివ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా, సత్య గిడుతూరి ఎడిటర్‌గా, రాజు అడ్డాల ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. – గాండ్ల శ్రీనివాస్ ( జీఎస్ మీడియా ) పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.