పెళ్లికి భాజా మోగింది.. నలభై ఏళ్ల వయసులో శృతి పెళ్లి ప్రకటన

‘పెళ్లికి భాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది..’ అంటూ సాంగ్ పాడుకుంటోంది అందాల తార, స్టార్ హీరోయిన్ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఇటు సౌత్, అటు నార్త్‌లోనూ తనకంటూ క్రేజ్ తెచ్చుకుంది శృతిహాసన్. హీరోయిన్‌గా, సింగర్‌‌గా మల్టీటాలెంట్‌తో తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు నలభై ఏళ్ల వయసులో ఆమె పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదికూడా తన తండ్రి కమల్ చూసిన సంబంధం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే శృతికి ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్‌ ఉండగా, తనతో రిలేషన్ బ్రేకప్ అయ్యిందని, అందుకే ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందట. ఈ నేపథ్యంలో తన బ్రేకప్ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. ఇప్పటికే తనకు సిక్స్ టైమ్స్‌ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని, వాటివల్ల చాలా ప్రెషర్‌‌ ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. ఇకపై సినిమానే జీవితంగా గడపాలనుకంటానని చెప్పింది. దీనిపై ఇంట్లో ఏం జరిగిందో ఏమో కానీ తాజాగా తండ్రి చూసిన అబ్బాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శృతిహాసన్. అసలు ఆ అబ్బాయి ఎవరు?, ఏం చేస్తారనే దానికిపై కమల్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. శృతికోసం కమల్ సెలెక్ట్ చేసిన ఆ హ్యాండ్సమ్ బాయ్ ఎవరో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు కమల్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కెరీర్‌‌లోనూ శృతిహాసన్ దూసుకుపోతోంది. వరుస క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. రీసెంట్‌గా మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ చిత్రంలో ‘సంచారి’ పాట పాడి గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిందామె.

Related Posts

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు…

‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని